Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హీరో ఎలక్ట్రిక్ నుంచి ఎన్వైఎక్స్-హెచ్ఎక్స్
హైదరాబాద్ : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు హీరో ఎలక్ట్రిక్ తన హెచ్ఎక్స్ సిరీస్‌లో కొత్తగా ఎన్వైఎక్స్ను విడుదల చేసింది. దీంతో ఒక్క చార్జింగ్‌తో ఏకంగా 82 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 210 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ చివరి మైలు డెలివరీ, వాణిజ్య వినియోగానికి, బి2బి వినియోగదారులకు ఇది బాగా ఉపయోగపడుతుందని పేర్కొంది. దీర్ఘకాలిక మన్నికతో నగదుకు నిజమైన విలువను అందిస్తాయి. దీని ప్రారంభ ధరను రూ.64,640గా నిర్ణయించింది.