Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణ, పర్యాటక రంగాల్లో నష్టం
న్యూఢిల్లీ : కోవిడ్-19 నిబంధనల దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా రవాణ, పర్యాటక రంగాల్లో 17.4 కోట్ల ఉద్యోగాలు పోయాయని ది వాల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) అంచనా వేసింది. ఈ పరిశ్రమ ప్రస్తుత ఏడాది చివరి వరకు ఇదే పరిస్థితిని ఎదుర్కోనుందని పేర్కొంది. డబ్ల్యూటీటీసీ గణంకాల ప్రకారం.. అంతర్జాతీయ పర్యాటకంలో కొనసాగుతున్న ఆంక్షలతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఇంతక్రితం 19.7 కోట్ల ఉద్యోగాలు పోనున్నాయని అంచనా వేసినప్పటికీ.. ఇటీవల పరిస్థితి కొంత మెరుగు పడటంతో ఉద్యోగాల్లో రికవరీ చోటు చేసుకుంటున్నట్టు పేర్కొంది. చైనా సహా పలు దేశాల్లో స్థానికంగా పర్యాటకం తిరిగి మొదలవుతుంది. 2020 చివరి నాటికి 3.1 కోట్ల ఉద్యోగాలు తిరిగి కాపడబడొచ్చని అంచనా వేసింది. పర్యాటకంలో నెలకొన్న ఆంక్షలతో ప్రపంచ జీడీపీకి 4.7 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగింది. 2019 ఆదాయాలతో పోల్చితే 53 శాతం ఆదాయం తగ్గింది.