Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గోద్రెజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్‌కు చెందిన గృహ క్రిమిసంహారక మందుల బ్రాండ్ గుడ్‌నైట్ విభాగంలో తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి కొత్తగా గుడ్‌నైట్ స్మార్ట్ స్ప్రేను విడుదల చేసినట్లు ప్రకటించింది. లిక్విడ్ స్మార్ట్ స్ప్రేతో లభించే ఈ ఉత్పాదన 8 గంటల పాటు దోమలకు వ్యతిరేకంగా పోరాడే సమగ్రమైన స్మార్ట్ పరిష్కారాన్ని కల్పిస్తుందని పేర్కొంది. 150 మిల్లీ లీటర్ల క్యాన్ ధరను రూ.199గా నిర్ణయించినట్లు వెల్లడించింది. ఒక్క సింగిల్ క్యాన్‌తో 700కు పైగా స్ప్రేలు అందిస్తుందని గోద్రెజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ ఇండియా సిఇఒ సునీల్ కటారియా తెలిపారు.