Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశ వ్యాప్తంగా క్యాపిటాల్యాండ్ నిర్వహిస్తున్న 10 బిజినెస్ పార్కుల్లో కరోనా వ్యాప్తి చెందకుండా సమర్థవంతమైన భద్రత చర్యలను చేపడుతున్నందుకు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ గ్లోబల్ బెంచ్‌మార్కింగ్ ధ్రువీకరణ అందుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ''మా పార్కుల సమగ్ర ఆడిట్ అనంతరం అందుకున్న ఈ సర్టిఫికేషన్, భారతదేశంలో క్యాపిటాల్యాండ్కు ఉన్న బిజినెస్ పార్కుల్లో బలమైన ఆరోగ్య, భద్రతా చర్యలను మరింత ధ్రువీకరిస్తుంది'' అని క్యాపిటాల్యాండ్ ఇండియా బిజినెస్ పార్కుల సీఈఓ వినమ్రా శ్రీవాస్తవ అన్నారు. క్యాపిటాల్యాండ్కు ప్రస్తుతం బెంగుళూరు, చెన్నరు, గుర్గావ్, హైదరాబాద్, ముంబయి, పుణెల్లో వ్యాపార, ఐటి పార్కులు, లాజిస్టిక్స్ ఆస్తులను కలిగి ఉంది.