Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హోండా కార్ వారి భారతదేశపు అత్యంత విజయవంతమైన మోడల్ -హోండా సిటీ 2020 జనవరి - డిసెంబర్ మధ్య 2020 క్యాలెండర్ సంవత్సరంలో సంచిత సేల్స్ 21,826 యూనిట్లతో మిడ్-సైజ్ సిడాన్ విభాగంలో సేల్స్ లో ఆధిపత్యంవహించింది. భారతదేశంలో హోండా వారి దీర్ఘకాలంగా కొనసాగుతున్న మోడల్ వారసత్వాన్ని నిజం చేస్తూ, సరికొత్త 5వ తరం సిటీ 2020 జూలైన ప్రారంభించబడింది మరియు తన ప్రీమియం డిజైన్, సాంకేతికత నైపుణ్యాలు, సాటిలేని సౌకర్యం, ఆధునిక భద్రత మరియు కనక్టివిటీతో మరోసారి మైలురాళ్లని అధిగమించింది. 2020 డిసెంబర్లో హోండా సిటీ మార్కెట్ వాట్ తన విభాగంలో 41%గా నిలిచింది.
హోండా సిటీ కేవలం తన విభాగపు సేల్స్ లో మాత్రమే ఆధిపత్యం వహించడం కాకుండా మిడ్-సైజ్ సిడాన్ విభాగం యొక్క పూర్తి వృద్ధికి తోడ్పడింది. ఇది సరికొత్త 5వ తరానికి చెందిన సిటీని ప్రారంభించిన తరువాత 2020 జులై-డిసెంబర్ లో 10%గా వృద్ధి చెందింది.2020 జులై-డిసెంబర్ విభాగానికి సంచిత సేల్స్ గత సంవత్సరంలో అదే సమయానికి 41,122 యూనిట్లతో పోల్చినప్పుడు 45,277గా నిలిచాయి. 2020 జులై-డిసెంబర్ లో హోండా సిటీ సంచిత సేల్స్ 17,347 యూనిట్లుగా ఉన్నాయి.
సిటీ సామర్థ్యం పై వ్యాఖ్యానిస్తూ, శ్రీ రాజేష్ గోయల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరక్టర్-మార్కెటింగ్ మరియు సేల్స్, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు,“భారతదేశంలో సిటీ బ్రాండ్ హోండాకి మారుపేరుగా నిలిచింది. నిరంతరంగా స్వీయ ఆవిష్కరణలతో, హోండా సిటీ తన కస్టమర్లకి ఆనందాన్ని కలిగించడానికి ప్రతీ తరం కొత్త సాంకేతికతల్ని మరియు విలువ ప్రతిపాదనల్ని అందిస్తోంది. ఈ ప్రక్రియలో నాణ్యత మరియు నమ్మకానికి కొల ప్రమాణం సృష్టించింది. గత ఏడాది జులైలో 5వ తరం సిటీ ప్రారంభోత్సవం సవాళ్లతో కూడిన సమయాలు ఉన్నా కూడా మిడ్ -సైజ్ సిడాన్ విభాగానికి ఎంతో అవసరమైన శక్తిని చేకూర్చింది. సిటీ బ్రాండ్ కోసం తమ ప్రేమని చూపించడాన్ని కొనసాగించి మరియు ఈ మోడల్ ని స్వంతం చేసుకున్న గర్వాన్ని అనుభవిస్తున్న మా పోషకులకు మా కృతజ్ఞతని మేము తెలియచేయాలని కోరుకుంటున్నాము.”
సరికొత్త హోండా సిటీ భారతదేశంలో సిడాన్స్ కు కొల ప్రమాణంగా నిలిచింది. మోడల్ ఇంజనీరింగ్ అద్భుతానికి తార్కాణంగా నిలిచింది, ఆధునిక కాలానికి చెందిన కస్టమర్లకు ఎంతగానో ఆకర్షిస్తోంది మరియు తన ప్రతీ వివరణలో అనగా స్టైలింగ్, సామర్థ్యం, సౌకర్యం, చోటు, కనక్టివిటీ మరియు భద్రతలలో ఆధిపత్యాన్ని కలిగి ఉంది. సరికొత్త 5వ తరం హోండా సిటీ తన విభాగంలో అతి పొడవైన మరియు వెడల్పైన సిడాన్. పెట్రోల్ వెర్,న్ లో VTC మరియు రీఫైండ్ 1.5 లీ ఐ-డీటెక్ డీజిల్ ఇంజన్ తోకొత్తగా పరిచయం చేయబడిన 1.5 లీ ఐ-విటెక్ డీఓహెచ్ సీ ఇంజన్ శక్తి నిండిన సామర్థ్యం అమోఘమైన ఇంథన సామర్థ్యాన్ని అందిస్తోంది. 5వ తరపు సిటీ అలెక్సా రిమోట్ సామర్థ్యంతో కనక్ట్ చేయబడిన భారతదేశపు మొదటి కారు మరియు 5 సంవత్సరాల ఉచిత సబ్ స్క్రిప్షన్ మరియు 32కి పైగా కనక్టెడ్ ప్రత్యేకతలతో అన్ని గ్రేడ్స్ లో ప్రామాణిక ఆఫరింగ్ గా టెలీమాటిక్స్ కంట్రోల్ యూనిట్ తో ఆధునిక హోండా కనక్ట్ ని కలిగి ఉంది. పెంపొందించబడిన తేలికైన బరువు, అత్యధిక దృఢత్వం మరియు కొలిషన్ భద్రత నిర్మాణం కలిగిన కొత్తగా రూపొందించబడిన ప్లాట్ ఫారం ASEAN N-CAP(ఏషియన్ ఎన్-క్యాప్) 5 స్టార్ రేటింగ్ కి సమానమైన ఆధునిక భద్రతని అందిస్తోంది. సిటీ తన విభాగంలోనే మొదటిసారిగా కలిగిన ప్రత్యేకతలైన ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, జడ్-ఆకారపు ర్యాప్ -అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, జీ-మీటర్ తో 17.7 సెం.మీ హెచ్ డీ ఫుల్ కలర్ టీఎఫ్ టీ మీటర్, లేన్ వాచ్ కెమేరా, జైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్ (ఏహెచ్ఏ) తో వెహికిల్ స్టెబిలిటి అసిస్ట్ (వీఎస్ఏ) మరియు ఇంకా ఎన్నో ప్రత్యేకతల్ని కలిగి ఉంది.
సిటీ కస్టమర్లు ఎల్లప్పుడూ ఎంతో ప్రత్యేకంగా ఉంటారు మరియు ప్రస్తుతమున్న సేల్స్ పోకడని బట్టి, అసంఖ్యాకమైన విభాగంలోనే తొలిసారి ప్రవేశపెట్టిన ప్రత్యేకతలతో ప్రముఖ ZX రకం గరిష్ట డిమాండ్ దాదాపు 50% పొందింది. మరొక పోకడలో, సరికొత్త 5వ తరం సిటీ యొక్క CVT రకాలు తొలి ఆరు నెలల్లో 48%వాటా కలిగి ఉన్నాయి.