Authorization
Mon Jan 19, 2015 06:51 pm
• సాటిలేని మెరుపును అందించటంతో పాటు 99.9 శాతం క్రిములను తొలగిస్తుందని వాగ్దానం చేస్తోంది
హైదరాబద్: ఆర్బి (రెకిట్ బెన్కైజర్), భారతదేశంలో అద్ధాలు మరియు ఇంటిలోని వస్తువులను శుభ్రం చేసే నెం.1 క్లీనర్ బ్రాండ్ కొలీన్ను ఒక సరికొత్త రూపంలో ఈ రోజు విడుదల చేసింది. ప్రస్తుతం భారతీయ వినియోగదారుని అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బి ఇండియా, ప్రతిష్ఠాత్మకమైన కొలీన్ బ్రాండును మళ్ళీ విడుదల చేసింది. వాగ్దానం చేసిన విధంగా సాటిలేని మెరుపును అందించటం మాత్రమే కాక, కొత్త కొలీన్ తన వినియోగదారులకు, ఇంటిలోని రకరకాల ఉపరితలాల మీద 99.9 శాతం క్రిములను నిర్మూలించే అదనపు లాభాన్ని కూడా అందిస్తుంది.
పారిశుధ్యం మరియు నిస్సంక్రమణ (డిజిన్ఫెక్షన్), వినియోగదారుల దైనందిన జీవితాల్లో అత్యవసరం అయ్యింది. విస్తృతస్థాయిలో జరిపిన వినియోగదారుల పరిశోధనలో, బ్రాండును గురించి అత్యధికంగా వెదకబడిన వాక్యాల్లో “కొలీన్ నిస్సంక్రమణ చేస్తుందా” ఒకటి. శుభ్రపరచవలసిన, క్రిమి నిర్మూలన చేయవలసిన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో తమ అవసరాలకుగాను విశ్వసనీయమైన కొలీన్ వంటి బ్రాండ్ కోసం వినియోగదారులు వెదుకుతున్నారని కూడా ఈ పరిశోధనలో తెలియవచ్చింది.
శ్రీమతి సుఖ్లీన్ అనేజా, సిఎంఒ మరియు మార్కెటింగ్ డైరెక్టర్, ఆర్బి హైజీన్, దక్షిణ ఆసియా, ఇలా అన్నారు,“దశాబ్దాలుగా, కొలీన్ పేరు ఇంటింటికీ చేరుకుంది. రకరకాల ఉపరితలాల పై మెరుపును కాపాడే విషయంలో సాటిలేని పేరుగాంచింది. ఉపరితలాల పై క్రిములు కూడా లేకుండా చేయటంలో సహకరించే అత్యుత్తమమైన మల్టీపర్పస్ క్లీనింగ్ ప్రోడక్ట్ కోసం వినియోగదారులు వెదుకుతున్నట్లు మా పరిశోధనలో తెలిసింది. భారతీయ వినియోగదారుల కొత్త అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఉత్పత్తిని విడుదల చేయటం జరిగింది. కొలీన్ ఇప్పుడు తన వినియోగదారులకు రకరకాల ఉపరితలాల పై అందిస్తోంది, అత్యుత్తమమైన శుభ్రత, తళుక్కుమనే మెరుపు, ఇంకా 99.9 శాతం క్రిముల నిర్మూలన.”
“విస్తృతస్థాయిలో జరిపిన వినియోగదారుల పరిశోధన ఆధారంగాను మరియు క్రిమి సంరక్షణ విషయంలో వారి అవసరాలను అర్ధం చేసుకుని జరిపిన ఆవిష్కరణ ఆధారంగా సరికొత్త కొలీన్ను రూపొందించటం జరిగింది. ఈ ఉత్పత్తి అందిస్తుందని అందరూ ఆశించే అద్భుతమైన మెరుపును మాత్రమే కాక, అన్ని ఉపరితలాల మీద 99.9 శాతం క్రిములను ఈ ఉత్పత్తి తప్పకుండా నిర్మూలిస్తుందని ఖరారు చేసుకునేందుకు ఈ ఉత్పత్తి పై పలు పరీక్షలను నిర్వహించటం జరిగింది. ” అని డా. స్కంద్ సక్సేనా, డైరెక్టర్-ఆర్అండ్డి, ఆర్బి హైజీన్, దక్షిణ ఆసియా చెప్పారు. దశాబ్దాలుగా కొలీన్, సాటిలేను మెరుపును ఇస్తుందన్న పేరును సంపాదించుకుంది. దీని విలక్షణమైన నీలం రంగు ట్రిగ్గర్ బాటిల్, దీనికి ఒక విభిన్నమైన గుర్తింపునిస్తుంది. తన వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండేందుకు తన కొత్త రూపంలో కొలీన్, అన్ని ఇ-కామర్స్ ప్లాట్ఫారంలలో, మోడరన్ మరియు సాంప్రదాయ వ్యాపార ఔట్లెట్లలో లభిస్తుంది.