Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దివ్యాంగులకు సమాచారం, సేవలు అందించేందుకు ఏకైక పరిష్కారంగా రూపొందించిన మొబైల్ యాప్ క్యాప్సారథిని ప్రారంభిస్తున్నట్టు క్యాప్‌జెమిని ప్రకటించింది. సార్థక్ ఎడ్యూకేషనల్ ట్రస్ట్ సహకారంతో అభివృద్ధిపరిచిన ఈ యాప్ ద్వారా “విభిన్నమైన సామర్ధ్యం” కలిగిన వ్యక్తులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి డిజిటల్‌గా, ఆర్థికంగా, సామాజికంగా సాధికారత కల్పించి వారి జీవితాలు స్పృశించాలన్నది ప్రధాన ఉద్దేశం. 21 రకాల వైకల్య శ్రేణులకు వారి అందుబాటు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడిన ఈ యాప్ హిందీ, ఇంగ్లిష్, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఆరు భాషల్లో అందుబాటులో ఉంది. తదుపరి దశల్లో మరిన్ని భారతీయ భాషల్లోనూ ఈ యాప్ అందుబాటులోకి రానుంది. అంగ వైకల్యం కలిగిన వ్యక్తులు లేదా వారి కుటుంబసభ్యులు దిగువ తెలిపిన సమాచారాన్ని పొందేలా క్యాప్‌సారథి దోహదపడుతుంది..
- వైకల్య సర్టిఫికేట్, పెన్షన్, రవాణా రాయితీలు, రిజర్వేషన్లు, మొదలైన ప్రభుత్వ పథకాలు, విధానాలు, నిబంధనలు.
- ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, ఉపాధి, పునరావాసం వంటి రంగాల్లో చేయూతనిచ్చే ప్రభుత్వ, ప్రైవేట్, లాభాపేక్షరహిత సంస్థల వివరాలు
- జాతీయ &అంతర్జాతీయ స్కాలర్షిప్ పథకాలు
- ఉచిత లేదా రాయితీతో పరికరాలు అందించేవారు
- బ్రెయిలీ-ఆన్లైన్-ఆడియో పుస్తకాలు, సాయపడే పరికరాల వివరాలు, వివాహసేవలు అందించే ఆన్లైన్ వేదికలు
- జరగబోయే సహాయ పరికరాల క్యాంపులు, ఉద్యోగ మేళాలు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు క్యాప్‌సారథి దిగువ తెలిపిన సేవలకు కూడా చేయూత అందిస్తుంది:
- వైకల్యం కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్, గైడెన్స్, ముందస్తు జోక్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, కెరీర్ ఎదుగుదల, కెరీర్ కొనసాగించేందుకు చేయూత
- ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులకు పేరెంట్స్ కౌన్సెలింగ్, గైడెన్స్, సపోర్టు
- మార్పునకు దోహదపడే వారితో పరిచయాలు, తెలియజేయడం, జ్ఞానబోధ
- వైకల్యం కలిగిన వ్యక్తులకు వర్తించే అసిస్టివ్ డివైసులు, కోర్టు తీర్పులు, ప్రభుత్వ నిబంధనలు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన తాజా సమాచారం.
క్యాప్‌సారథి యాప్‌నకు చెందిన ఈ సేవలన్నీ భారతదేశవ్యాప్తంగా వర్చువల్ విధానంతో పాటు సార్థక్ ఎడ్యూకేషన్‌కు చెందిన 19 కేంద్రాల ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి. అంతే కాదు వైకల్యం కలిగిన వ్యక్తులకు బోధనా సామగ్రి, ప్రభుత్వ పథకాలు, జాబ్ పోర్టల్స్ వివరాలు కూడా ఈ యాప్ అందజేస్తుంది. ఈ యాప్‌లో నమోదు చేసుకునే యూజర్ వివరాలు, అవసరాలకు అనుగుణంగా అవసరమైన శిక్షణ, సేవలను అందించడం క్యాప్‌సారథి ప్రత్యేకత. అంతే కాదు గతంలో ఎక్కడైనా నైపుణ్య కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే ఆ వివరాలు, 18-35 వయోశ్రేణి వారి ఉపాధి వివరాలను కూడా ఇది తెలుసుకుంటుంది. ఈ సమాచారం ఆధారంగా నమోదు పెంచడానికి, వారికి చేరువవడానికి సమీకరణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. శిక్షణ పూర్తైన తర్వాత క్యాప్‌సారథి యూజర్లకు ఉపాధి అవకాశాలు కూడా సమకూర్చబడతాయి.
క్యాప్జెమినిగురించి
- కన్సల్టింగ్, డిజిటల్ట్రాన్స్ఫార్మేషన్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ సేవల్లో ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాప్‌జెమిని. - - అభివృద్ధి చెందుతున్న క్లౌడ్, డిజిటల్, రంగాల్లో క్లైంట్ల అవసరాలకు తగినట్టు సృజనాత్మకతను అందించడంలో ఈగ్రూప్ ముందు స్థానంలో ఉంది.
- 50ఏళ్ల బలమైన వారసత్వం, ఈ రంగానికి సంబంధించి నిర్ధిష్టమైన అనుభవంతో వివిధ సంస్థలు తమ వ్యాపార లక్ష్యాలు సాధించేలా స్ట్రాటజీ నుంచి ఆపరేషన్స్ వరకు రకరకాల సేవలను క్యాప్జెమినిఅందిస్తోంది. బాధ్యతాయుతమైన, ఈ బహుళ సాంస్కృతిక సంస్థలో 265,000 మంది 50 దేశాల్లో పనిచేస్తున్నారు. సుస్థిరమైన,సమిష్టితత్వంతో కూడిన భవిష్యత్ కోసం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మానవ శక్తిని వెలికితీసే ఉద్దేశంతో క్యాప్‌జెమిని పనిచేస్తోంది.
అల్ట్రాన్తో కలిపి 2019లోగ్రూప్ ప్రపంచవ్యాప్తంగా €17బిలియన్ల రెవెన్యూ ఆర్జించింది. www.capgemini.com లోమమ్మల్నిసందర్శించండి.
భారతదేశంలో 12 ప్రాంతాల్లో 125,000 మంది సభ్యులు క్యాప్‌జెమినిలో పనిచేస్తున్నారు.
అవి: బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, నొయిడా, పుణే, సేలం, తిరుచురాపల్లి. క్యాప్‌జెమిని ఇండియా గురించి మరింత తెలుసుకునేందుకు www.capgemini.com/in-en. చూడండి.