Authorization
Mon Jan 19, 2015 06:51 pm
o ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఎక్స్‌షోరూమ్ ధర 1,26,372 రూపాయలు.
o ఏప్రిలియా నుంచి ప్రీమియం ఆఫరింగ్‌ను తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌ల వద్ద మరియు తమ వెబ్సైట్ https://apriliaindia.com/ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు.
హైదరాబాద్: ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను నేడు హైదరాబాద్‌లో ఆవిష్కరించినట్లు పియాజ్జియో ఇండియా నేడు వెల్లడించింది. అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ఈ ప్రీమియం స్కూటర్ ఇప్పుడు 1,26,372 రూపాయల ధరలో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా లభిస్తుంది. దీనిని తొలుత 5వేల రూపాయల మొత్తం చెల్లించి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ డీలర్‌షిప్‌లు లేదా ఈ–కామర్స్ వెబ్సైట్ https://apriliaindia.com/ వద్ద కూడా బుక్ చేసుకోవ చ్చు. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్160 అత్యంత ఆకర్షణీయమైన గ్లోసీ రెడ్, మాట్ బ్లూ, గ్లోసీ వైట్ మరియు మాట్ బ్లాక్ రంగులలో లభ్యమవుతుంది.