Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఫెడరల్ బ్యాంక్ నికర లాభాలు 8 శాతం తగ్గి రూ.404 కోట్లకు పరిమితమయ్యాయి. మొండి బాకీల కోసం అధిక కేటాయింపులు చేయడం వల్ల లాభాలకు గండి పడింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.441 కోట్ల లాభాలు సాధించింది. గడిచిన క్యూ3లో మొండి బాకీల కేటాయింపులు 84 శాతం ఎగిసి రూ.559 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం క్యూ2లో రూ.303 కోట్ల కేటాయింపులు చేసింది.