Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర 1,07, 904 రూపాయలు (ఎక్స్‌షోరూమ్ ధర, ఢిల్లీ)
హైదరాబాద్: బజాజ్ ఆటో ఇప్పుడు తమ నూతన పల్సర్ 180ను ఆవిష్కరించింది. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్పోర్ట్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ఇది. బోల్డ్ డెకాల్స్ మరియు ఆటో హెడ్‌ల్యాంప్ ఆన్ (ఏహెచ్ఓ)తో ట్విన్ పైలెట్ ల్యాంప్స్‌తో కూడిన పల్సర్ 180 అత్యంత ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. దేశంలో 150సీసీ విభాగంలో బైక్ విప్లవాన్ని ఆరంభించేలా దీనికి రూపకల్పన చేశారు. ఈ నూతన అవతార్‌లో స్పోర్టీ స్ల్పిట్ సీట్లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు ఇన్ఫినిటీ ఎల్ఈడీ టైల్ ల్యాంప్ కలిగి ఉంది. ఈ మోటార్‌సైకిల్‌లో 4స్ట్రోక్ ఎస్ఓహెచ్సీ 2–వాల్వ్ ఎయిర్ కూల్డ్ బీఎస్ 6 ప్రమాణాలు డీటీఎస్–ఐఎఫ్ఐ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 14.52 ఎన్ఎం టార్క్ (6500 ఆర్పీఎం)ను 12.52 కిలోవాట్ శక్తిని 8500 ఆర్పీఎం వద్ద అందిస్తుంది. దీనిలో 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ ఉండటంతో పాటుగా ఫ్రంట్ సస్పెన్షన్‌పై టెలిస్కోపిక్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ మరియు వెనుక వైపు 5 వే అడ్జస్టబుల్ నైట్రాక్స్ షాక్ అబ్సార్బర్ ఉన్నాయి.
ప్రీమియం నాణ్యత, విప్లవాత్మక అంతర్జాతీయ శైలి మరియు ప్రపంచశ్రేణి పనితీరు కోరుకుంటున్న వినియోగదారుల విభాగపు అవసరాలను నూతన పల్సర్ 180ను తీర్చనుంది. ప్రస్తుతం 20% స్పోర్ట్స్ బైకింగ్ విభాగపు అవసరాలను 180–200 సీసీ మోటార్‌సైకిల్స్ తీరుస్తున్నాయి. నూతన పల్సర్ 180 ఇప్పుడు స్పోర్ట్స్ వాహన విభాగంలో అత్యుత్తమ పనితీరు కోసం వెదుకుతున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. గత 20 సంవత్సరాలగా ఈ విభాగంలో తమ ఆధిపత్యంను ఇది ప్రదర్శిస్తూనే తమ నాయకత్వస్ధానం బలోపేతం చేసుకుంది. ఈ నూతన 2021 పల్సర్ 180 ధర 1,07,904 రూపాయలు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ). దేశవ్యాప్తంగా అన్ని బజాజ్ ఆటో ఆధీకృత డీలర్షిప్స్ వద్ద లభ్యమవుతుంది.