Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీకే బిర్లా గ్రూప్‌లో భాగమైన ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ కొత్తగా 50 శాతం విద్యుత్‌ను ఆదా చేసే ఇన్వర్టర్ ఫ్యాన్లను ఆవిష్కరించినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా తన ప్రీమియం ఫ్యాన్ల పోర్ట్ ఫోలియోను మరితంగా విస్తరించినట్లయ్యిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ విభాగంలో 48 శాతం మార్కెట్ వాటా ఉందని తెలిపింది. బీఈఈ 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ ఫ్యాన్లు ప్రారంభ ధరను రూ.4700గా నిర్ణయించినట్టు తెలిపింది.