Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సుమారుగా 85ఏళ్లుగా లివైజ్®మహిళలకు తగిన జీన్స్ దుస్తుల తయారీలో మమేకమై నైపుణ్యాన్ని సాధించింది. ఒరిజినల్ బ్లూ జీన్‌ను 1873లో పరిచయం చేయగా, ఐకానిక్ 501®మరియు 1934లో మహిళలకు మొట్టమొదటి నీలిరంగు జీన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన బ్రాండ్, మహిళల ఫ్యాషన్ విభాగంలో మరియు తన ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు చేసుకుంటూ వస్తోంది. నేడు, బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఎప్పటిలాగే అందరికీ చేరువలో ఉంటూ, నూతన శ్రేణి ఫ్యాషన్ శైలులను, దాన్ని ధృవీకరించే అధికారానికి పరిచయం చేస్తూ వస్తోంది. నేటి తరం మహిళా వినియోగదారులకు ఆకట్టుకునే దిశలో నాణ్యత మరియు సౌఖ్యతను అందించాలన్న బ్రాండ్ డిఎన్ఏతో సంబంధిత ఫ్యాషన్-ఫార్వర్డ్ ఆఫర్ కోసం చూస్తున్నారు; లివైజ్®ఇదే దిశలో తన ప్రయాణంలో తదుపరి అడుగు ముందుకు వేసింది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి, గ్లోబల్ ఫ్యాషన్, యూత్ ఐకాన్ దీపికా పదుకొనేతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని లివైజ్® సగర్వంగా ప్రకటించింది. లివైజ్® నుంచి అందుబాటులోకి వస్తున్న ఫ్యాషన్ ఫిట్‌లపై పదుకొనే దృష్టిసారించి వాటికి సమగ్ర స్థాయిలో తన ప్రచార జాగృతిని కల్పించనున్నారు.
తన భాగస్వామ్యం గురించి దీపికా పదుకొనే మాట్లాడుతూ “ప్రామాణికత, వాస్తవికత మరియు నిజాయితీ అనేవి బ్రాండ్ నిర్మించుకున్న విలువలు కాగా, వాటిని నేను ఎక్కువగా గుర్తిస్తాను! వీటి గురించి అవగాహన లేని వారికి నేను తెలియజేసేది ఏమిటంటే, నేను ఎప్పుడూ జీన్స్ టీ షర్ట్ ధరించేందుకు ఇష్టపడే అమ్మాయిని. సరైన జీన్స్ దుస్తులు, నాకు సుఖంగా ఉండటమే కాకుండా ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది!'' అన్నారు.
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బ్రాండ్లలో ఒకటైన లెవిస్‌తో భాగస్వామ్యం కలిగి ఉండటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను మరియు ఆనందంగా ఉందని’’ పేర్కొన్నారు. ‘‘గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్’’గా పదుకునే నియమాకంపై లివైజ్®దక్షిణ ఆసియా &మెనా (MENA)- మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మొహంతి మాట్లాడుతూ ‘‘దీపిక మాతో కలవడం థ్రిల్ కలిగించింది, దీపిక తరహాలో మా బ్రాండ్ విలువలు ధైర్యంగా, ప్రామాణికమైనవి, వాస్తవమైనవి మరియు రాజీపడని వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా నిలుస్తాయి. ఆమె స్టైల్ ఐకాన్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా యువతకు, మహిళలకు ప్రేరణ అందించే మహిళ కూడా. ఆమె మా బృందంలోకి వచ్చిన తరువాత, ప్రత్యేకంగా మేము మహిళా విభాగానికి చెందిన దుస్తులను పరిగణనలోకి తీసుకుని బ్రాండ్‌ను బలోపేతం చేయడంపై ఎక్కువ దృష్టి సారించామని’’ వివరించారు.
లివైజ్®, ఈ ఏడాది హై-రైజెస్, ఆన్-ట్రెండ్ లూజ్ ఫిట్స్ మరియు రన్‌వే వైడ్-లెగ్ బాటమ్స్ తదితర స్టేట్మెంట్ - మేకింగ్ షేప్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. లివైజ్® అభిమానుల అభిరుచులను పరిగణనలోకి తీసుకుని అందుబాటులోకి తీసుకు వస్తున్న నూతన హై లూజ్ శ్రేణి ఫ్యాషన్ దుస్తుల శ్రేణి ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేసుకునేందుకు ప్రేరేపిస్తుండగా, బూట్ కట్ మరియు మైల్-హై ఫిట్స్ వినియోగదారులకు అత్యంత ఫేవరెట్‌గా నిలువనున్నాయి.
వాటర్<లెస్® సాంకేతికతను ఉపయోగించుకుని 96% నీటిని ఆదా చేసే 20 కన్నా ఎక్కువ విభిన్న తయారీ విధానాలను అనుసరిస్తున్న మేము ఇప్పటి వరకు 3 బిలియన్ లీటర్ల నీటిని ఆదా చేసాము మరియు మరో 5 బిలియన్ల లీటర్ల నీటిని రీసైకిల్ చేసాము. ఈ శ్రేణి టెన్సెల్TMశ్రేణిని పరిచయం చేస్తుండగా టెన్సెల్TM అనేది రీసైకిల్ చేయబడిన కలప గుజ్జు మరియు కలపతో తయారు చేయబడిన అత్యంత స్థిరమైన మరియు చాలా మృదువైన వస్త్రం కాగా, దీన్ని సుస్థిరంగా నిర్వహిస్తున్న యూకలిప్టస్ మరియు స్ప్రూస్ అడవుల నుంచి సేకరించారు. నూతన శ్రేణి లివైజ్® మహిళల దుస్తుల తయారీ, స్టైల్ స్టేట్మెంట్లో స్థిరత్వంతో అగ్రగామిగా కొనసాగుతోంది.