Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శామ్సంగ్ కర్డ్ మెస్ట్రోTM సరికొత్త ఆవిష్కరణ
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ మరియు నం.1 రిఫ్రిజిరేటర్ బ్రాండ్ శామ్సంగ్, నేడు నూతన శ్రేణి డిజి-టచ్ కూల్TM 5ఇన్1 సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లలో డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లను అందుబాటులోకి తీసుకు వచ్చి సరికొత్త విప్లవానికి తెరతీస్తున్నట్లు ప్రకటించింది. ఈ నూతన రిఫ్రిజిరేటర్లు మెరుగైన డిజిటల్ టచ్ టెక్నాలజీ ప్యానెళ్లతో అందుబాటులోకి రాగా, అది వినియోగదారులకు వారి రిఫ్రిజిరేటర్ సెట్టింగ్‌లను రిఫ్రిజిరేటర్ తలుపులు తెరచేందుకు ఒక స్పర్శతో నియంత్రించేందుకు అవకాశం కల్పిస్తుంది మరియు చల్లదనాన్ని కాపాడుతూ విద్యుత్తును ఆదా చేసేందుకు సహకరిస్తుంది.
నూతన రిఫ్రిజిరేటర్ శ్రేణి ధర రూ.17,990 నుంచి ప్రారంభమవుతుంది మరియు నాలుగు నూతన ఫ్లోరల్ ప్యాట్రన్లు- డిలైట్, బ్లాసమ్, మార్బుల్ వైట్ మరియు ట్విర్ల్లలో లభిస్తుంది. ఎక్కువ స్టోరేజ్ స్థలం మరియు అనుకూలతలు అందించేందుకే డిజైన్ చేసిన శామ్సంగ్ నూతన డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు పేటెంట్ పొందిన డిజి-టచ్ కూల్TM5ఇన్1 సాంకేతికతతో అందుబాటులోకి రాగా, వినియోగదారులకు సీజన్లకు అనుగుణంగా ఉష్ణోగ్రతను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది మరియు అవసరమైన సమయంలో సరళమైన స్పర్శతో డి-ఫ్రాస్ట్ చేస్తుంది.
ఇతర 5ఇన్1 ఫీచర్లలో పవర్ కూల్ 53%మేర వేగవంతంగా ఐస్ తయారు చేస్తుంది మరియు 33% వేగంగా చల్లదనాన్ని అందిస్తుంది. విద్యుత్తు కోతతో రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత 9° సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ అయితే బ్లాక్ ఔట్ నోటిఫికేషన్ టచ్ ప్యానెల్‌లోని దీపం మినుక్కుమని వెలగడం ద్వారా తెలియజేస్తుంది మరియు రిఫ్రిజిరేటర్ ఆటో ఎక్స్‌ప్రెస్ కూలింగ్‌కు మారడం ద్వారా వినియోగదారులకు ఆహారం వ్యర్థం కాకుండా అడ్డుకునేందుకు సహకరిస్తుంది. వినియోగదారులు చలికాలంలో అలానే ఎక్కువ ప్రమాణంలో కూలింగ్ అవసరం లేనప్పుడు టచ్ ప్యానెల్లో ఎకో మోడ్ ఎంపిక చేసుకుని 28% ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.
తన 2021 శ్రేణిలో భాగంగా శామ్సంగ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కర్డ్ మెస్ట్రో™ ఫీచర్‌ను తన పూర్తి శ్రేణికి విస్తరిస్తుండగా, అందులో ఎంట్రీ స్టేజ్ డైరెక్ట్ కూల్ శ్రేణి అలాగే ఫ్రాస్ట్ ఫ్రీ అలానే సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి.
‘‘భారతదేశంలో సింగల్ డోర్ అత్యంత పెద్ద రిఫ్రిజిరేటర్ వలయం కాగా, దాన్ని మరింత విస్తరించేందుకు మేము శామ్సంగ్లో మా వినియోగదారుల జీవితాల్లో మార్పు తీసుకు వచ్చే ఆవిష్కరణను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కట్టుబడి ఉన్నాము. మా డిజి-టచ్ కూల్TM 5ఇన్1 రిఫ్రిజిరేటర్లను వృద్ధి చేసిన అనుకూలతలు, సేకరణ సామర్థ్యం మరియు విద్యుత్ దక్షతల కోసం డిజైన్ చేయగా, ఈ అన్నీ వినియోగదారులు రిఫ్రిజిరేటర్లలో తప్పనిసరిగా నిరీక్షించే ప్రత్యేకతలు. మా కర్డ్ మెస్ట్రో TM శ్రేణికి భారతీయ వినియోగదారులు చూపించిన ప్రేమతో మేము మరింత ధన్యులమయ్యాము. మేము ఈ ప్రత్యేక ఫీచర్లు అన్నీ సామర్థ్యపు వలయాలకు ఇప్పుడు అందిస్తున్నాము. నూతన 2021 శ్రేణి రిఫ్రిజిరేటర్లు ఈ విభాగంలో మా మార్కెట్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయనున్నాయని’’ శామ్సంగ్ ఇండియా సీనియరు ఉపాధ్యక్షుడు రాజు పుల్లన్ తెలిపారు.
ధర, ఆఫర్లు మరియు లభ్యత:
శామ్సంగ్ నూతన డిజి-టచ్ కూల్ 5ఇన్1 శ్రేణిలోని అన్ని రిటైల్ ఛానెళ్లు అలానే శామ్సంగ్ అధీకృత ఆన్లైన్ స్టోర్ శామ్సంగ్ షాప్‌లో ఫిబ్రవరి 23 నుంచి అందుబాటులోకి వచ్చింది మరియు ధర రూ.17,990 నుంచి ప్రారంభం కావడం ద్వారా ప్రత్యేకతలు మరియు సాంకేతికత సంయోజనను అందిస్తుంది. ఈ ఏడాది డైరెక్ట్ కూల్ శ్రేణిలో డిలైట్, బ్లాసమ్, మార్బుల్ వైట్ మరియు ట్విర్ల్ అనే నాలుగు నూతన ఫ్లోరల్ ప్యాట్రన్లను విడుదల చేసింది.
డిజి-టచ్ కూల్ 5ఇన్1: వినియోగదారుల అవసరాలను పరిష్కరించే ఆవిష్కరణ
శామ్సంగ్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లను డిజి-టచ్ కూల్™ 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో రెండు సామర్థ్యాలు-198 లీటర్ మరియు 225 లీటర్లలో విడుదల చేస్తుండగా, 225 నూతన సామర్థ్యపు ఎంపికగా అందుబాటులోకి వచ్చింది. నూతన శ్రేణి 10-ఏళ్ల వారెంటీను కంప్రెసర్ మరియు డిజిటల్ ఇన్వర్టర్ సాంకేతికతలో స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్స్‌తో అందుబాటులోకి వస్తోంది. శామ్సంగ్ రిఫ్రిజిరేటర్లో డిజైన్ అత్యంత ముఖ్యమైనదని అర్థం చేసుకుంటుంది ఎందుకంటే అది మొత్తం మీద గృహాలంకరణకు ప్రత్యేక సొబగు అందిస్తుంది. ఈ అత్యాధునిక శ్రేణి ప్రీమియం సమానాంతర కర్వ్ డిజైన్‌తో మరియు గ్యారో హ్యాండిల్ మీ నివాస స్థలానికి బలమైన ఆకర్షణ అందిస్తుంది.
జీవితం సరళీకరణ
డిజి-టచ్ కూల్™ 5ఇన్1 రిఫ్రిజిరేటర్లు 5 అసాధారణ ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చాయి:
డిజి కంట్రోల్ టెంపరేచర్ సెట్టింగ్- మెరుగైన ఉష్ణోగ్రత నియంత్రణ సెట్టింగ్స్ కలిగి ఉండి, వినియోగదారులు సులభంగా తమ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలను వివిధ సీజన్లకు అనుగుణంగా నియంత్రించుకోవచ్చు. వివిధ దశల ఉష్ణోగ్రతల అంశాలు వినియోగదారులకు వారి ఆహారం అత్యుత్తమంగా నిలువ ఉండడమే కాకుండా మారుతున్న సీజన్ల అవసరాలకు తగినట్లు అందించే భరోసా ఇస్తుంది. పవర్ కూల్-శామ్సంగ్ డిజి-కూల్™ 5ఇన్1 రిఫ్రిజిరేటర్ పవర్ కూల్ బటన్ కలిగి ఉండగా, 53% మేర వేగవంతంగా మంచు గడ్డలను సిద్ధం చేయగలగడం మరియు 33% వేగవంతమైన కూలింగ్ అందిస్తుంది. ఇది వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా మంచు గడ్డలను తయారు చేసుకునేందుకు సహకరిస్తుంది.
ఎకోమోడ్- ఎకో మోడ్ పని రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతను సగటున 6 డిగ్రీ సెల్సియస్‌కు నియంత్రించడం ద్వారా 28% ఇంధనాన్ని ఆదా చేసి, చలికాలం, రాత్రుళ్లు ఎక్కువ ప్రమాణంలో కూలింగ్ అవసరం అయినప్పుడు పని నిర్వహణ ఖర్చును తగ్గిస్తుంది. బ్లాక్ ఔట్ నోటిఫికేషన్- విద్యుత్తు నిలిచిపోయినప్పుడు రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత 9° డిగ్రీ సెంటీగ్రేడ్ పైగా పెరిగినప్పుడు బ్లాక్ఔట్ నోటిఫికేషన్ ప్రత్యేతక టచ్ ప్యానెల్‌పై దీపాన్ని మినుకుమినుకు మంటూ వెలుగుతూ తెలియజేస్తుంది మరియు రిఫ్రిజిరేటర్ ఆటో ఎక్స్‌ప్రెస్ కూలింగ్‌కు మారడం ద్వారా వినియోగదారులకు ఆహారం వ్యర్థం కాకుండా అడ్డుకుంటుంది.
ఇ-డిఫ్రాస్ట్- బిల్ట్-ఇన్ ఫీచర్‌తో వినియోగదారులు 3 క్షణాల పాటు డి-ఫ్రాస్ట్ బటన్ ఒత్తడం ద్వారా ఫ్రీజర్‌ను డీఫ్రాస్ట్ చేయవచ్చు. ఇది తక్షణమే ఫ్రీజర్ డోరు మరియు ఎవాపరేటర్ నుంచి ఐస్‌ను నివారించే ప్రక్రియ ప్రారంభిస్తుంది, ఒకసారి డీఫ్రాస్టింగ్ ప్రక్రియ ప్రారంభమైతే అది ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ అవుతుంది. వినియోగదారులు ఏ సమయంలో అయినా డి-ఫ్రాస్ట్ టచ్ ప్యానెల్‌ను 3 సెకెండ్ల పాటు ఒత్తి పట్టుకోవడం ద్వారా డి-ఫ్రాస్టింగ్ ప్రక్రియను నిలిపి వేయవచ్చు. నూతన శ్రేణి ఫ్రీజర్ సంప్రదాయక ఫ్రీజర్‌తో పోల్చితే థర్మోస్టాట్ నాబ్ నుంచి గందరగోళరహితంగా మరియు విశాలంగా కనిపిస్తుంది. ఇది అప్‌గ్రేడెడ్ వెజ్ బాక్స్‌తో అదనంగా 1.5 లీటర్ల సామర్థ్యం మరియు న్యూ ఫ్రెష్ మ్యాక్స్™ను బాటిల్ గార్డ్‌తో కలిసి వస్తుంది. అంటే విద్యుత్తు ఆదాతో రాజీపడని ఎక్కువ స్టోరేజ్ స్థలాన్ని అందిస్తుంది. అత్యాకర్షణీయమైన నూతన శ్రేణి ప్రీమియం హారిజంటల్ కర్వ్ డిజైన్ మరియు గ్యారో హ్యాండిల్ మీ నివాస స్థలానికి ఎక్కువ సౌందర్యాన్ని అందిస్తుంది.
కర్డ్ మెస్ట్రో™: నిత్యం ఇంటికి ఆవిష్కరణ
కర్డ్ మెస్ట్రో™ ప్రత్యేకత ఇప్పుడు డైరెక్ట్ కూల్ మరియు సైడ్-బై సైడ్ రిఫ్రిజిరేటర్లను కలిగిన పూర్తి శ్రేణికి లభిస్తుంది. కర్డ్ మెస్ట్రో™ రిఫ్రిజిరేటర్లు భారతదేశంలో సంప్రదాయక రిఫ్రిజిరేటర్లను ఆహార సేకరణ మరియు ఆహార సంరక్షణ ఆవలకు తీసుకు వెళ్లాయి. కర్డ్ మెస్ట్రో™ అత్యంత సంకీర్ణమైన, సమయాన్ని కోరే మరియు సూక్ష్మంగా ఉంటున్నప్పటికీ, భారతీయ ఇళ్లలో తప్పనిసరిగా అలవర్చుకోదగిన పెరుగు చేసుకునే కష్టాన్ని అడ్డుకుంటుంది. కర్డ్ మెస్ట్రో™ శామ్సంగ్ చేసిన స్థానిక ఆవిష్కరణ కాగా, స్థానిక అవసరాలను నెరవేర్చడం ద్వారా పెరుగును ప్రతిసారీ అదే తరహా స్థిరతతో తయారు చేస్తుంది మరియు వివిధ వాతావరణ పరిస్థితుల్లో పెరుగు చేసే సమస్యను నివారిస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్లు ఈ ప్రత్యేకతతో మీ మరియు మీ కుటుంబపు దారిలో ఏదీ అడ్డురాకుండా ధృవీకరిస్తుంది; పెరుగు తయారు చేయడాన్ని 6.5 నుంచి 7.5 గంటలు-6.5 గంటల్లో మృదువైన పెరుగు, 7.5 గంటలకు గట్టి పెరుగు అందిస్తుంది. దీనికి పాలను కాచాలి మరియు పెరుగును కలపాలి అంతే మిగిలిన పనిని కర్డ్ మెస్ట్రో™ చేస్తుంది. ఇది పెరుగును పులియకుండా, అది ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది.