Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఆరు రోజుల పాటు లాక్ డౌన్.. ప్రకటించిన సీఎం
  • కరోనా మృతదేహానికి అంత్యక్రియలు చేసిన ముస్లిం యువకులు
  • భార్యా భర్తల మధ్య గొడవ.. భార్య ఆత్మహత్య
  • కరోనా వచ్చిందన్న జనం.. కొడుకు శవాన్ని భుజాన వేసుకుని..
  • రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ మృతి.. అనాథ అయిన మూడేళ్ల కొడుకు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం

Wed 24 Feb 19:56:49.479348 2021

హైదరాబాద్: అశోక యూనివర్సిటీ తన ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం అయిన యంగ్ ఇండియా ఫెలోషిప్ (వైఐఎఫ్)లో భాగంగా 11వ బృందం కోసం రెండు,మూడో విడత దరఖాస్తులను నేడు ప్రకటించింది. 12 ఏప్రిల్ 2021 వరకూ వీటిని స్వీకరిస్తారు. 2011లో ఆరంభమైన యంగ్ ఇండియా ఫెలోషిప్ (వైఐఎఫ్) 21వ శతాబ్దం కోసం సామాజిక స్ఫూర్తి కలిగిన నాయకులు అలాగే సంస్కర్తలను సిద్ధం చేస్తోంది. లిబరల్ స్టడీస్‌లో పూర్తిగా రెసిడెన్షియల్ విదానంలో ఉండే ఏడాది కాల వ్యవధి గల మల్టీడిసిప్లినరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇది. ఫెలోస్‌కు ఇది ఏడాది కాలంలోనే బహుళ విద్యా విభాగాలు మరియు ప్రొఫెషనల్ విభాగాల్లో నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది.
        ఆసక్తి గల వ్యక్తులు అందరూ ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంపూర్ణంగా పరిశీలించి, ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వూ కోసం షార్ట్‌లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఆర్థిక సాయం కోసం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. దరఖాస్తు చేసే సమయంలో డాక్యుమెంట్ల సమర్పణ విషయంలో సడలింపులు ఉంటాయి, అలాగే కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం ఇంకా భద్రతకు భరోసా కోసం ఈ మొత్తం అడ్మిషన్ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఏ విభాగంలోనైనా గుర్తింపు కలిగిన అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు (దరఖాస్తు చేసే నాటికి ఆఖరు సంవత్సరం విద్యార్థులు కూడా అయి ఉండవచ్చు), అలాగే 1 ఆగస్ట్ 2021 నాటికి 28 సంవత్సరాల వయస్సు మించని వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఉద్యోగ అనుభవం మరియు/లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ, అలాగే ఏవిధమైన విద్యాపరమైన లేదా ప్రొఫెషనల్ నేపథ్యం నుంచి అయినా ఉండవచ్చు. యంగ్ ఇండియా ఫెలోషిప్ డీన్ అనిహా బ్రార్ ఈ కోర్సు గురించి తెలియజేస్తూ, ‘‘దశాబ్దం క్రితం అపూర్వమైన ప్రయోజనాలతో వైఐఎఫ్ ఉన్నత విద్యా రంగంలోకి అడుగుపెట్టింది. అసాధారణ బృందం, అద్భుతమైన భోదనా సిబ్బంది (ఫ్యాకల్టీ), అలాగే రైటింగ్, క్రిటికల్ థింకింగ్ ఇంకా రియల్ వరల్డ్ ప్రాజెక్టుల ఆధారంగా ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించడం జరిగింది. వైఐఎఫ్ బలం తన వారసత్వంపై ఆధారపడి లేదు, అయితే అశోక యూనివర్సిటీ అందిస్తున్న అసాధారణ ప్రయోజనాలను కొనసాగిస్తూ తనను తాను ఎల్లప్పుడూ తిరిగి ఆవిష్కరించుకుంటూ వస్తోంది.’’ అని పేర్కొన్నారు.
          వైఐఎఫ్ ’14 డైరెక్టర్, అవుట్‌రీచ్ మరియు అడ్మిషన్స్, అశోక అలుమ్ని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కరన్ భోళా దీని గురించి మాట్లాడుతూ... ‘‘పూర్తిగా ఆన్‌లైన్ మరియు పరిపూర్ణ అడ్మిషన్ ప్రక్రియ వల్ల దరఖాస్తుదారులు సొంతంగా అన్ని చక్కబెట్టుకోవడానికి వీలవుతుంది అలాగే వివిధ దశల్లో వారి అత్యుత్తమ ప్రామాణిక ప్రత్యేకతలను బయటపెట్టేలా చేస్తుంది. వైవిధ్యభరితమైన మరియు అసాధారణమైన 11వ బృందం కోసం మేం వేచిచూస్తున్నాం. పరిశ్రమలు, భోధన, ఎంట్రప్రెన్యూర్‌షిప్ లేదా ఇంకా మరెక్కడైనా సరే మహమ్మారి తదనంతరం అర్థవంతమైన కెరీర్స్‌ కోసం ఎంతో కీలకమైన అంతర్గత క్రమశిక్షణ దృక్పథాలు మరియు సామర్థ్యాలతో కూడిన పట్టభద్రులను సిద్ధం చేయడమే దీని లక్ష్యం. స్వయంగా నేను కూడా ఒక ఫెలో అయినందున, యువత కోసం వైఐఎఫ్ ఎలాంటి సమూల మార్పులను తీసుకొస్తుందనేది నాకు స్పష్టంగా తెలుసు’’ అని వివరించారు.
           ఎంపికైన అభ్యర్థులకు అశోక యూనివర్సిటీ వారి అవసరాల ప్రకారం ఆర్థిక సహాయ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ప్రోగ్రామ్ వ్యయం అలాగే వారి చెల్లింపు సామర్థ్యం మధ్య అంతరాన్ని పూడ్చడం కోసం తగిన ఆర్థిక తోడ్పాటును అందించడమే దీని లక్ష్యం. అవసరాల అధారిత సహాయం అనేది ఫీజుల్లో మాఫీల రూపంలో అందించడం జరుగుతుంది. ట్యూషన్ ఫీజులో 25 శాతం రాయితీ నుంచి నివాసం మరియు భోజనాలతో సహా మొత్తం ఫీజులో 100 శాతం శ్రేణిలో ఈ మాఫీలు ఉంటాయి.
        గడిచిన దశాబ్ద కాలంలో, అశోక యూనివర్సిటీలోని యంగ్ ఇండియా ఫెలోషిప్ (వైఐఎఫ్) లిబరల్ ఆర్ట్స్ మరియు సైన్సెస్‌కు సంబంధించిన విద్యాభ్యాసంలో విద్యార్థులకు శిక్షణనిస్తూ వస్తోంది. సమస్యల పరిష్కారం అలాగే ఆలోచించడంలో కొత్త మార్గాలను వారికి కల్పిస్తోంది, ప్రభావవంతమైన కెరీర్స్‌ కోసం వారిని సంసిద్ధులుగా చేస్తోంది. హార్వర్డ్, యేల్, ఐఎస్‌బీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ తదితర దిగ్గజ సంస్థల నుంచి అత్యంత వైవిధ్యభరితమైన అధ్యాపకుల దన్నుతో ఈ ఏడాది 200 మంది విద్యార్థులకు ఈ ఫెలోషిప్ చేసే అవకాశం లభిస్తుంది. మరింత సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం పెరుగుతున్న నేపథ్యంలో, చాలామంది వ్యక్తులు తమ 20ల్లో ఇప్పుడు క్రమబద్ధ డిగ్రీలకు మించి ఏదైనా చేయాలని చూస్తున్నారు. ఈ తరుణంలోనే లిబరల్ ఆర్ట్స్ మరియు సైన్సెస్‌ విద్యాభ్యాసం అంతకంతకూ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. విద్యార్థులు అలాగే యువ వృత్తి నిపుణులకు విశాల దృక్పథంతో కూడిన విద్యను అందించాలన్న దృష్టితో, ఈ లిబరల్ ఆర్ట్స్ డిగ్రీ అనేది ప్రజా విధానాలు, చరిత్ర, నాయకత్వం, వ్యూహం, ఫైన్ ఆర్ట్స్, మీడియా, కమ్యూనికేషన్, అలాగే ఇంకా అనేక రంగాల్లో బోధనను అందిస్తుంది. కార్పొరేట్ వ్యూహాన్ని రూపొందించేందుకు అవసరమైన సునిశితత్వాన్ని పొందేలా లిబరల్ ఆర్ట్స్ ప్రోత్సహిస్తుంది, అలాగే భారతదేశం యొక్క సంక్లిష్టమైన సామాజిక నిర్మాణం గురించి కూడా అవగాహన పెంచుతుంది. నేటి సమాజం అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయం సాధించేందుకు అవసరమైన సంపూర్ణ నైపుణ్యాలను సమర్థవంతంగా నేర్చుకోవాలంటే లిబరల్ ఆర్ట్స్‌లో డిగ్రీ తప్పనిసరిగా ఉండాల్సిందే.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కరుగుతున్న రూపాయి
స్విగ్గీలో సాఫ్ట్‌ బ్యాంక్‌ భారీ పెట్టుబడులు..!
నేడు ఆర్‌టిజిఎస్‌ సేవలు రద్దు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ లాభాల్లో 18% వృద్థి
ఐదు లక్షలకు చేరనున్న టిసిఎస్‌ ఉద్యోగుల సంఖ్య
హమోఫిలియా కోసం సమైఖ్యంగా నిలుస్తోన్న తకెడ
ఆర్థిక వ్యవస్థ రికవరీకి ముప్పు
హ్యుందాయ్ లక్ష కార్ల ఎగుమతులు
మెక్డొనాల్డ్స్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా రష్మిక
ఎనిమిది కొత్త బ్యాంక్‌ల కోసం దరఖాస్తులు
అమెజాన్‌లో క్రికెట్‌ యాక్సెసరీస్ 50% వ‌ర‌కు త‌గ్గింపు
మెక్డొనాల్డ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
ఆసుస్‌ నుంచి కొత్త ప్రీమియం లాప్‌ టాప్‌లు
ఫ్యాటీ లివర్‌పై గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సూచనాలు
శామ్‌సంగ్ స్మార్ట్ స్కూల్ నుంచి 80 జేఎన్‌వీ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు
జూన్14న ఎల్‌శాట్‌–ఇండియా 2021ను నిర్వహించనున్న ఎల్‌శాక్‌
16న కర్నూలులో తనైరా చేనేత చీరల ప్రదర్శన
ఒప్పో నుంచి ఎఫ్19 స్మార్ట్‌ఫోన్ విడుదల
డెయిరీ డే నుంచి ఐస్ క్రీం కేక్స్
రిలయన్స్ జువెల్స్ ప్రాంతీయ సాంప్రదాయ బంగారు ఆభరణాలు
క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ సరికొత్త ఆవిష్కరణ
ఎయిడ్‌ హెల్త్‌కేర్‌ స్టార్టప్స్‌
అసుస్‌ నుంచి జెన్‌బుక్‌ డ్యూయో ల్యాప్‌టాప్స్‌ విడుదల
బీఎండబ్ల్యూ మోటర్రాడ్ భాగస్వామిగా జేఎస్‌పీ మోట‌ర్రాడ్ నియామ‌కం
శాంసంగ్ నుంచి నియో క్యుఎల్‌ఈడీ టీవీ విడుద‌ల‌
ఫర్నిషింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్న ఏషియన్ పెయింట్స్
ఎన్ఐయూఏ, బీవీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ
హెల్మెట్స్‌ ప్రోగ్రామ్‌ కోసం స్టీల్‌బర్డ్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఎఫ్‌ఐఏ
అమెజాన్ ఫ్యాషన్ మెగా ఫ్యాషన్ సేల్­
ప్రిన్స్‌ పైప్స్‌కు అనుకూలంగా ఉత్తర్వ్యులను అందజేసిన బాంబే హైకోర్టు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.