Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:ఈకోఎక్స్, ప్లాస్టిక్ వ్యర్థపదార్ధాల యాజమాన్య రంగంలో ఒక స్టార్టప్. ప్లాస్టిక్ క్రెడిట్ సర్ఫికెట్లను బదిలీ చేసుకోవటానికి వీలుకల్పించేందుకు మరియు ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేసేందుకు భారతదేశంలో తొలి డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించింది. పర్యావరణ మంత్రిత్వశాఖ, అడవులు మరియు వాతావరణ మార్పు శాఖ, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఇపిఆర్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2016 క్రింద) కొరకు జారీ చేసిన యూనీఫార్మ్ ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించి, ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్‌ను ఉపయోగించే ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు మరియు బ్రాండ్ యజమానులు (పిఐబిఒలు), తుదివ్యర్ధానికి జవాబుదారులు అవుతారు.
కొత్త ఇపిఆర్ ముసాయితా మార్గదర్శకాలు ఇప్పుడు పిఐబిఒలు, ప్యాకేజింగ్‌ను రీసైకిల్ చేసే లేదా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్ధాన్ని కో-ప్రొసెస్ చేసే అనుమోదిత కంపెనీల నుండి ప్లాస్టిక్ క్రెడిట్లను తాము పాటించవలసిన లక్ష్యాలను సాధించేందుకు అనుమతిస్తాయి. ఈకోఎక్స్ ప్రారంభించిన ఈ మార్కెట్‌ప్లేస్, ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాల ఈకోవ్యవస్థతో ప్రమేయం కలిగిన వ్యక్తులు మరియు సంస్థలను, ప్లాస్టిక్ క్రెడిట్ సర్టిఫికెట్ల పారదర్శకపద్ధతిలో క్రయవిక్రయాలు జరిపేందుకు ఒక చోటుకు చేరుస్తుంది. ఈ మోడల్ వలన మూడు ప్రయోజనాలు ఉన్నాయి: మొదటిది, బ్రాండ్లు ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాల ఇపిఆర్ అనుపాలనను అత్యంత ప్రభావవంతమైన పద్ధతిలో చేసేట్లు చేస్తుంది; రెండవది, ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలు నైతికమైన పద్ధతిలో సేకరింపబడి, రవాణా చేయబడి, అంతమొందించబడేలా జాగ్రత్త వహిస్తుంది, ఇక మూడవది, రీసైకిల్ చేయబడిన పరిమాణం మేరకుగాను రీసైకిల్ చేసేవారికి నగదుపరంగా లబ్దిని కలిగించటం ద్వారా మరియు మెరుగైన ధరను పొందగలగటంలో సహకరించటం ద్వారా కో-ప్రొసెసర్లకు ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ కారకాలు అన్ని, సమర్ధవంతమైన ఇపిఆర్ అనుపాలన కోసం ప్లాస్టిక్ క్రెడిట్స్ మోడల్‌ను అమలు చేసేందుకు, ప్రభుత్వానికి సహాయపడతాయి, ఎట్టకేలకు శుభ్రమైన పర్యావరణంలో నివసించటాన్ని సుసాధ్యం చేసేందుకు దారితీస్తాయి.
(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మరియు డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా వారు సహసంస్థాపన జరిపిన) అన్-ప్లాస్టిక్ కలెక్టివ్ వారు నిర్వహించిన ఒక అధ్యయానాన్ని అనుసరించి, భారతదేశం ఏటా 9.46 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలను సృష్టిస్తుంది.పర్యావరణ మంత్రిత్వశాఖను అనుసరించి, ఈ వ్యర్ధంలో దాదాపు 40 శాతం సేకరించబడకుండా మిగిలిపోతోంది. ఈ వ్యర్ధంలో పెద్దమొత్తం, లోతుగా ఉన్న ప్రదేశాలను నింపటమో లేక సముద్రాలలోకి చేరుకోవటమో జరుగుతోంది. రీసైక్లింగ్‌కు అవసరమైన మౌలికసదుపాయాలు తగినంతగా లేకపోవటమే ఇందుకు కారణం. మార్కెట్‌ప్లేస్ ద్వారా ఈకోఎక్స్, ప్లాస్టిక్ క్రెడిట్ ఎక్స్ఛేంజ్ యొక్క డిజిటైజ్డ్ ప్రక్రియ ద్వారా మరియు ఈకోవ్యవస్థతో ప్రమేయం కలిగిన వ్యక్తులను, సంస్థలను ఒక ఉమ్మడి బిందువు వద్దకు తీసుకురావటం ద్వారా భారతదేశపు వ్యర్ధపదార్ధాల యాజమాన్య పరిశ్రమకి మార్గదర్శన చేసి శుభ్రమైన భవిష్యత్తును నిర్మించాలని సంకల్పిస్తోంది. ఈ డిజిటల్ వేదికను ప్రవేశపెట్టటం ద్వారా ఈకోఎక్స్, ఇపిఆర్ను దేశవ్యాప్తంగా అమలు చేయటాన్ని సుసాధ్యం చేస్తోంది.
ఈకోఎక్స్ వేదికను ప్రారంభిస్తూ, నిమిత్ అగర్వాల్, సంస్థాపకులు, ఈకోఎక్స్, ఇలా అన్నారు,“శుభ్రమైన భవిష్యత్తు కోసం ఒక డిజిటల్ ఆవిర్భావాన్ని నమోదు చేయాలన్న ఆలోచన నుండి జనించిన, స్వచ్ఛ భారత్ మిషన్‌కు అనుగుణ్యమైన ఈకోఎక్స్, ఒక సుస్థిరమైన డిజిటల్ ఈకోవ్యవస్థను, సురక్షితమైన మరియు పరస్పరం లబ్దిని కలిగించే ప్లాస్టిక్ క్రెడిట్ సర్టిఫికెట్ లావాదేవీలను ఎక్కడినుండైనా, ఎప్పుడైనా చేపట్టగలిగేందు ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాల యాజమాన్య వాల్యూ శ్రేణితో ప్రమేయం ఉన్న వ్యక్తులు సంస్థల కోసం సృష్టించాలని సంకల్పించింది. రీసైకిల్ చేయటం ద్వారా ప్లాస్టిక్‌ను తయారుచేస్తే, కొత్తగా ప్లాస్టిక్‌ను తయారు చేయటం వలన వెలువడే దాని కన్నా తక్కువ CO2వెలువడుతుంది. రీసైక్లింగ్ అనుకూలమైనదైన కారణంగా ఈకోఎక్స్, పర్యావరణం నుండే ఎక్కువ ప్లాస్టిక్‌ను సేకరించేలా జాగ్రత్త వహిస్తుంది. రీసైక్లింగ్‌కు ప్రోత్సాహాలను అందించటం ద్వారా ప్లాస్టిక్ వ్యర్ధాలు సేకరించబడి, రీసైకిల్ చేయబడేలా ఈకోఎక్స్ జాగ్రత్త వహిస్తుంది. మహాసముద్రాలలోకి తక్కువ ప్లాస్టిక్ చేరుకునేలా జాగ్రత్త వహించటం ద్వారా ఇది జలచరాలను కాపాడటంలో సహాయపడుతుంది.”
ఒక అధీకృత ఛానెల్ ద్వారా ప్లాస్టిక్ క్రెడిట్ సర్టిఫికేషన్లను విక్రయించటం ద్వారా పొందగలిగిన లాభాలను గురించి రీసైకిల్ చేసేవారికి అవగాహన కల్పించటం ద్వారా అసంఘటిత రీసైక్లింగ్ రంగాన్ని సరిదిద్దాలని ఈకోఎక్స్ సంకల్పించింది. ఉత్పత్తిదారులు తమ అనుపాలన (ఇపిఆర్) లక్ష్యాలను సాధించేట్లు, ప్లాస్టిక్ సేకరణ మరియు రీసైకిలింగ్ ప్రక్రియ అంతా ఒక పారదర్శకమైన పద్ధతిలో నిర్వహించబడేట్లు ఇది జాగ్రత్త వహిస్తుంది. ఈకోఎక్స్ సాంకేతిక పరిజ్ఞాన వేదికకు, భారతదేశంలోని ప్రముఖ జాతీయ స్పాట్ ఎక్స్ఛేంజ్, ఎన్సిడిఇఎక్స్ ఇ-మార్కెట్స్ లిమిటెడ్ సహకారం లభిస్తోంది. డొమెయిన్ నిపుణులతో ఇది పని చేస్తుంది, పలురకాల సామాగ్రుల క్రయవిక్రయాల కోసం ట్రేడింగ్ వేదికలను ఆఫర్ చేస్తుంది. ఈ ట్రేడింగ్ వేదికలు, సాంకేతిక పరిజ్ఞాన సామర్ధ్యం మరియు పారదర్శక పరిస్థితుల్లో మార్కెట్ అనుకూల ఫీచర్లను మిళితం చేసి, ట్రేడింగ్‌ను ఒక ఘనమైన మరియు లాభదాయకమైన అనుభవంగా మారుస్తాయి.
ఈకోఎక్స్ గురించి
ఈకోఎక్స్, ఒక విలక్షణమైన భారతీయ డిజిటల్ మార్కెట్‌ప్లేస్. సభ్యులు ప్లాస్టిక్ క్రెడిట్ల క్రయవిక్రయాలను జరిపేందుకు ఒక పారదర్శకమైన ట్రేడింగ్ వేదికను ఇది కల్పిస్తుంది. ఈకోఎక్స్ యొక్క విలక్షణమైన స్థితి కారణంగా, మార్కెట్‌ప్లేస్ యొక్క శక్తిని సభ్యులు ఉపయోగించుకుని, వాస్తవసమయపు ధరలను పొందగలగటంలో సహాయపడుతుంది. ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాల యాజమాన్య మౌలికసదుపాయాలను సరైన మార్గంలో పెట్టేందుకు నిధులను ఛానెలైజ్ చేసేందుకుగాను సాంకేతిక పరిజ్ఞానాన్ని డిజైన్ చేయటం జరిగింది. ఈకోఎక్స్, తన పోర్టల్ పై ఆటో మార్కెట్ దిద్దుబాటు ద్వారా మరియు క్రెడిట్ల ప్రత్యక్ష బదిలీ ద్వారా ఈకోఎక్స్, అన్ని పక్షాలు కాస్ట్ లాభాలను పొందగలిగేట్లు చేస్తుంది. ప్రత్యేకించిన మా ఖాతా యాజమాన్య సేవతోనూ, సత్వరమైన సెటిల్మెంట్ ప్రక్రియతోనూ, ట్రేడింగ్‌ను సులభం చేయటమైనది.