Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: FedEx Corp (NYSE: FDX) అనుబంధ సంస్థ, ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్స్ప్రెస్ రవాణా కంపెనీ అయిన FedEx Express, ‘లింగ సమానత్వంలో అత్యుత్తమ సంస్థ’గా ప్రపంచ హెచ్ఆర్డీ కాంగ్రెస్ ప్రకటించిన వైవిధ్యం మరియు సంఘటిత నాయకత్వ పురస్కారాలు 2021లో గుర్తింపు దక్కించుకుంది. వైవిధ్యం, సంఘటిత నాయకత్వ పురస్కారాలు అనేవి వైవిధ్యం మరియు సంఘటిత చర్యల విషయంలో చేపట్టిన కృషి మరియు తపనకు గుర్తింపుగా వ్యక్తులు, సలహా సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు, అలాగే సంస్థలకు అందించడం జరుగుతుంది. ప్రపంచ హెచ్ఆర్డీ కాంగ్రెస్ నిర్వహించిన ఈ పురస్కార కార్యక్రమంలో ఈ ఏడాది 400కు పైగా సంస్థలు పాల్గొన్నాయి. ‘‘మేము చేపట్టిన లింగ సమానత్వ చర్యలు, టీమ్ సభ్యులందరూ రాణించేందుకు సురక్షితమైన, వైవిధ్యభరితమైన మరియు సంఘటిత పని వాతావరణాన్ని కల్పించడం కోసం మేము అమలు చేస్తున్న కార్యక్రమాలు మరియు విధానాలకు గుర్తింపుగా మాకు ఈ గౌరవం లభించింది’’ అని FedEx Express భారత్ కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సయేఘ్ పేర్కొన్నారు.
‘‘వైవిధ్యం, సంఘటిత మరియు లింగ సమానత్వానికి కట్టుబడి ఉండటం అనేది మా సంస్థ సంస్కృతిలో సమగ్రమైన భాగం అలాగే మా టీమ్ సభ్యులందరూ రాణించేందుకు మరియు ప్రగతి పథంలో పయనించేందుకు సమానమైన అవకాశాన్ని కల్పించాలన్నది మా బలమైన సంకల్పం. మహిళలు వ్యక్తిగతంగా అలాగే వృత్తిపరంగా కూడా కొంగొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం మరియు పురోభివృద్ధి చెందడానికి అవసరమైన సాధన సంపత్తిని అందించే విధంగా తగిన కార్యక్రమాలను అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం’’ అని ఆయన వివరించారు. ఇటీవలే FedEx Express మధ్య ప్రాచ్యం, భారత ఉపఖండం మరియు ఆఫ్రికా (ఎంఈఐఎస్ఏ) ప్రాంతంలో నాయకత్వం, పురోభివృద్ధి, విద్య, మరియు ఉద్యోగకల్పన (ఎల్ఈఏపీ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహిళలు మార్గదర్శకత్వాన్ని (మెంటార్షిప్) వహించేందుకు సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు, అలాగే సంస్థలోపలే తమ వృత్తిలో మరింత పురోగతి సాధించేందుకు సాధన సంపత్తిని అందించడమే ఈ మెంటారింగ్ కార్యక్రమం లక్ష్యం.
‘మహిళలకు సాధికారత సూత్రాలు - వ్యాపారమంటే సమానత్వం’ అనే ఉద్యమానికి మద్దతుగా సీఈవో ప్రకటనపై మధ్యప్రాచ్యం, భారత ఉపఖండం, ఆఫ్రికా ప్రాంత (ఎంఈఐఎస్ఏ) ప్రాంతీయ ప్రెసిడెంట్ జాక్ ముహ్స్ 2020 మార్చిలో సంతకం చేశారు. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్, యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఈ మహిళల సాధికారత సూత్రాలను రూపొందించాయి. సంస్థల్లోనూ సమాజంలోను లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు కంపెనీలు పాటించదగిన ఏడు కార్యాచరణ ప్రణాళికలు ఇందులో ఉన్నాయి. అంతర్జాతీయంగా భిన్నత్వాన్ని పాటించే అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా FedExను ఫోర్బ్స్ మ్యాగజైన్ 2019లో గుర్తించింది. అలాగే 2020లో భారత్లో మహిళలు ఉద్యోగం చేసేందుకు టాప్ 50 ఉత్తమ సంస్థల్లో ఒకటిగా గ్రేట్ ప్లేస్ టు వర్క్® ఇనిస్టిట్యూట్ నుంచి కూడా గుర్తింపు పొందింది.