Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్స్పైప్స్ ట్రేడ్‌మార్క్‌ను కాపీ చేయకుండా ఆజ్ఞలు
సంగారెడ్డి: బాంబే హై కోర్టు 10 మార్చి 2021వ తేదీన మధ్యంతర ఉత్తర్వ్యును ప్రిన్స్ ప్లాటినమ్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, విగర్ ప్లాస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు ధనంజయ్ బ్రాస్ ప్రొడక్ట్స్‌కు వ్యతిరేకంగా ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ లిమిటెడ్ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన వ్యాజ్యానికి అనుకూలంగా జారీచేసింది (10మార్చి 2021వ తేదీన బాంబే హైకోర్టు కోరమ్జస్టిస్ జీఎస్ పటేల్ కేస్ నెంబర్ 5290 ఆఫ్ 2021 కమర్షియల్ సూట్ నెంబర్ 5286 ఆఫ్ 2021కు అనుసరించి)
జస్టిస్ జీఎస్ పటేల్ తన ఉత్తర్వ్యులలో ప్రిన్స్ ప్లాటినమ్ ట్రేడ్ మార్క్‌ను ప్రిన్స్ ప్లాటినమ్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, విగర్ ప్లాస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు ధనంజయ్ బ్రాస్ ప్రొడక్ట్స్‌లు ఉపయోగించడంతో పాటుగా ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ లిమిటెడ్ నిర్మించిన గుడ్‌విల్, పరపతిని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశాయన్నారు. నిహార్ చద్దా, ఏవీపీ– స్ట్రాటజీ, ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘నకిలీలకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలను ప్రిన్స్ పైప్స్ చేపట్టింది మరియు ఈ తరహా కేసులన్నింటిపై వేగవంతమైన, చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటుంది. ప్రిన్స్ పైప్స్ అసలు ప్రిన్స్ ప్లాటినమ్ పేరుతో ఎలాంటి ఉత్పత్తినీ తయారుచేయలేదు. ఇతర నకిలీ తయారుదారులు ప్రిన్స్ పైప్స్ బ్రాండ్‌ను మోసపూరిత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా నిలుపుకుంటున్న ప్రిన్స్ పైప్స్ విశ్వసనీయత కాపాడుకోవడం కోసం పూర్తి చర్యలను తీసుకోవడం జరుగుతుంది’’ అని అన్నారు.
మార్కెట్లో విస్తరించిన గందరగోళం పోగొట్టడంతో పాటుగా మా పరపతికి నష్టం వాటిల్లకుండా మరియు మోసపూరిత ఉత్పత్తుల కారణంగా మా మార్కెట్ వాటాపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు మా కంపెనీ బాంబే హైకోర్టును సంప్రదించి నకిలీ ఉత్పత్తుల విక్రయాలను నిలుపుదలచేయాల్సిందిగా కోరింది. ప్రిన్స్ పైప్స్ తరపున కోర్టులో సీనియర్ న్యాయవాది డాక్టర్ వీరేంద్ర తుల్జాపుర్కర్ మరియు న్యాయవాది శ్రీ హిరేన్ కమోద్లు వాదనలను తమ న్యాయ సంస్థ ఇండస్ లా సహకారంతో వాదనలు చేశారు.