Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం ఎక్కువగా అభిమానించే మహిళల ఎథ్నిక్ వేర్ బ్రాండ్, సోచ్ తమ సరికొత్త స్టోర్‌ను తిరుపతిలో ప్రారంభించింది. సోచ్‌కు తిరుపతిలో ఇది మొదటి స్టోర్.
ఈ స్టోర్ 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సోచ్ యొక్క తాజా కలెక్షన్స్ దీనిలో ప్రదర్శిస్తారు. ఈ నూతన స్టోర్ ఎయిర్ బైపాస్ రోడ్, న్యూ బాలాజీ కాలనీ వద్ద ఉంది. ఈ స్టోర్‌లో ప్రదర్శించే నూతన కలెక్షన్లో అత్యద్భుతమైన పింక్స్, రిఫ్రెషింగ్ ఎల్లోస్, డీప్ వైన్స్, బ్లూ, ఆహ్లాదకరమైన మస్టర్డ్స్, ఆకర్షణీయమైన బ్లాక్స్‌తో పాటుగా నూతన జోడింపు అయిన నియాన్స్ కూడా ఉంటాయి.
సోచ్ ఇప్పటికే ఏపీలో ఆరు నగరాలలో తమ ఉనికిని చాటుతుంది. స్థానిక మార్కెట్లు మరియు ధోరణులను అర్థం చేసుకుని వీటిని ఏర్పాటుచేయడం జరిగింది.
ఈ స్టోర్ ప్రారంభం సందర్భంగా వినయ్ చట్లానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈవొఉసోచ్ అప్పెరల్స్ మాట్లాడుతూ మహోన్నతమైన ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మా స్టోర్‌ను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్‌లో మా బ్రాండ్ పట్ల అపూర్వమైన ప్రేమను వ్యక్తీకరిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మేము విస్తృతస్ధాయిలో ఉనికిని చాటుతున్నాము. ఈ ప్రాంతంలోని మా వినియోగదారులకు మా నూతన కలెక్షన్ మొదలు అపారమైన అవకాశాలను సైతం అందించనున్నాం. అత్యద్భుతమైన ఎథ్నిక్ వేర్‌ను సహేతుకమైన ధరలలో ఇక్కడ అందించే ఏర్పాట్లు చేశాము అని అన్నారు.
దేశంలో సోచ్ గత 16 సంవత్సరాలుగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 57 నగరాలలో 141 స్టోర్లు సోచ్‌కు ఉన్నాయి. వీటితో పాటుగా సోచ్ ఇప్పుడు సెంట్రల్‌వద్ద షాప్ ఇన్ షాప్స్ నిర్వహిస్తుండటంతో పాటుగా తమ సొంత వెబ్సైట్ సోచ్ డాట్ కామ్, ఈఉకామర్స్ పోర్టల్స్ అయిన అమెజాన్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్, అజియో, న్యాకా వంటి వాటి వద్ద కూడా లభ్యమవుతుంది. ప్రధాన మెట్రో నగరాలతో పాటుగా టియర్ 2 పట్టణాలలో సైతం విస్తరించేందుకు ప్రణాళిక చేసింది సోచ్. దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో విస్తృతమైన సోచ్ ఇప్పుడు ఉత్తర, తూర్పు భారతదేశాలలో తమ ఉనికిని బలంగా చాటడానికి ప్రయత్నిస్తోంది.