Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద కిచెన్ అప్లయెన్సెస్ బ్రాండ్ టీటీకె ప్రెస్జిజ్ , మిక్సర్ గ్రైండర్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ గ్రైండింగ్, కోయడం, జ్యూసింగ్, నిల్వ చేయడం మరియు చట్నీ చేయడం సహా మరెన్నో కార్యకలాపాలను చేసేలా రూపొందించి ఇప్పుడు ప్రెస్టిజ్ డిలైట్ ప్రో మిక్సర్ గ్రైండర్‌ను విడుదల చేసింది. ఇది మొట్టమొదటి ఆరు జార్ల మిక్సర్ గ్రైండర్. ఇది అత్యంత ఆకర్షణీయంగా మెటాలిక్ పర్పుల్ ఫినీష్‌తో వస్తుంది. ఈ మిక్సర్ గ్రైండర్లో 750 వాట్ స్వచ్ఛమైన రాగి మోటర్ ఉంది. ఎలాంటి వంటకపు తయారీ అయినా ఆహ్లాదకరమైన అనుభవంగా డిలైట్ ప్రో మార్చనుంది. మెరుగైన పనితీరు మరియు అత్యద్భుతమైన లుక్స్ యొక్క వినూత్నమైన సమ్మేళనం డిలైట్ ప్రో. ఇది మూడు ఎస్ఎస్ జార్లతో వస్తుంది. ఇవి అన్ని రకాల గ్రైండింగ్ అవసరాలను తీర్చనున్నాయి. అలాగే ఓ పాలీకార్బనేటడ్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్, ఓ మల్టీ యుటిలిటీ జార్ , కాంప్లిమెంటరీ మిక్స్–ఓ–కీప్ జార్ తో ఇది వస్తుంది. అత్యంత ఆకర్షణీయంగా మరియు చూడగానే ఆకట్టుకునే శైలిలో ఉన్న జార్ హ్యాండిల్స్ సౌకర్యవంతమైన గ్రిప్‌ను సైతం అందిస్తాయి. ఈ కంపెనీ ఇప్పుడు మెజరింగ్ కప్‌ను సైతం జోడించడం వల్ల బహుళ వినియోగపు జార్లో ఎంత మేర నీరు కలుపవచ్చో తెలుసుకోవచ్చు. ఈ మిక్సర్ గ్రైండర్ ఏడు సమర్థవంతమైన, ధృడమైన స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్‌తో వస్తుంది. ఆహార పదార్థాలను అత్యుత్తమంగా గ్రైండింగ్ చేసే అవకాశం ఇది అందిస్తుంది. దీనిలో ఎస్ఎస్ డ్రై గ్రైండింగ్, ఎస్ఎస్ వెట్ గ్రైండింగ్, ఎస్ఎస్ చట్నీ బ్లేడ్స్, ఎస్ఎస్ జ్యూసర్ బ్లేడ్స్, 2 బ్లేడ్స్ (నీడింగ్ మరియు చోపింగ్) లు మల్టీ యుటిలిటీ జార్‌తో పాటుగా మిక్స్–ఓ–కీప్ జార్‌తో ఓ స్థిరమైన బ్లేడ్ ఉంటాయి. క్లీనింగ్ ప్రకియకు సహాయపడేందుకు స్పతులాను సైతం జోడించారు. దీనిని బ్లేడ్స్ తొలగించేందుకు సైతం ఉపయోగించవచ్చు. భద్రతా కోణంలో డిలైట్ ప్రోలో ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ సైతం ఉంది. ఈ మిక్సర్ గ్రైండర్ ఐఎస్ఐ ధృవీకృతం. ప్రెస్టిజ్ డిలైట్ ప్రో ఇప్పుడు రెండు సంవత్సరాల వారెంటీతో, మోటర్‌పై ఐదు సంవత్సరాల వారెంటీతో వస్తుంది. ఈ మిక్సర్ గ్రైండర్ ధర 9295 రూపాయలు. ప్రెస్టిజ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు మరియు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా సుప్రసిద డీలర్ఔట్లెట్ల వ్యాప్తంగా లభ్యమవుతుంది.