Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మే 28న, లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం మరియు హక్కులపై (SRHR) జాగృతి కల్పిస్తూ, వాదించేందుకు, మద్దతు ఇచ్చేందుకు, అవగాహన పెంచుతూ, మేము మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని ఆచరిస్తాము. భారతదేశంలో ముఖ్యంగా చిన్న పట్టణాలు (Tier II), చిన్న నగరాల్లోని (Tier III) మహిళలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సరళంగా అందుబాటులోకి తీసుకు రావలసిన అవసరాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. ప్రసవ సమయంలో అసురక్షిత శస్త్ర చికిత్స విధానాలతో సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ (SSI) అనేది ఒకటి కాగా, ప్రసవ సమయంలో మహిళలు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లలో ఇదే ప్రధానమైనది.
మహిళల ఆరోగ్యానికి ప్రధాన ఆందోళన సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ (SSI)
సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ (SSI) అనేది శస్త్రచికిత్స జరిగిన శరీర ప్రాంతంలో సంభవించే శస్త్రచికిత్స అనంతర ఇన్ఫెక్షన్ను సూచిస్తుంది. కొన్నిసార్లు, ఇవి ఉపరితల అంటువ్యాధులకు కారణమవుతాయి. మరికొన్ని సార్లు చర్మం బయటి పొరను ప్రభావితం చేస్తాయి. మరికొన్ని అంటువ్యాధులు చర్మం, అవయవాలు లేదా చర్మం కింద కణజాలాలకు సోకే అవకాశం ఉంటుంది.
సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ (SSI) ప్రమాదం పలు అంశాల ద్వారా ప్రభావితమవుతుందని అర్థం చేసుకోవలసి ఉంటుంది:
· శస్త్రచికిత్స చేసే గది స్టెరిలిటీ, ఆపరేటింగ్ పరికరాలు, సర్జికల్ నైపుణ్యాలు, శస్త్రచికిత్స వ్యవధి (రెండు గంటల కంటే ఎక్కువ ఉన్న సందర్భాలలో ఇన్ఫెక్షన్కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి), మరియు సంబంధిత పర్యావరణ వ్యవస్థ.
· ఊబకాయం, ధూమపానం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ మరియు అత్యవసర శస్త్రచికిత్సలు చేయించుకున్న లేదా క్యాన్సర్, మధుమేహంతో బాధపడుతున్న వారి వంటి రోగులలో ఇప్పటికే ఉన్న వైద్య పరిస్థితులు
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, SSI అనేది అనారోగ్యం, మరణాలకు ప్రధాన కారణంగా ఉంటుంది. ఇంకా, ఇది శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న రోగులకు వైద్య ఖర్చుల అదనపు భారాన్ని మోపుతుంది. ఎందుకంటే SSI తరచుగా ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో తిరిగి శస్త్ర చికిత్స అవసరం కూడా కావచ్చు. పని చేసే రోజులు కోల్పోవడంతో ఆర్థిక భారం మరింత ఎక్కువ అవుతుంది.
జాన్సన్ & జాన్సన్ మెడ్‌టెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ మక్కర్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో SSI శాతం 1.6% నుంచి 38% వరకు మారుతూ ఉంటాయి. సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ డేటాను సాధారణంగా పట్టణ ప్రాంతాల నుండి సేకరిస్తారు. అయితే గ్రామీణ ఆసుపత్రుల నుంచి డేటా సేకరిస్తే, ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువగానే ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. కనుక, అధ్యయనాలు మరియు వారి పరిశోధనలు SSI భారానికి సంబంధించి పరిమాణాన్ని వాస్తవంగా ప్రతిబింబించకపోవచ్చు. సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ కేసుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు, మెడ్‌టెక్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో సున్నితత్వం, అవగాహన మరియు శిక్షణ అవసరం ఎక్కువగా ఉండవచ్చు. మేము, జాన్సన్ & జాన్సన్లో, భారతదేశంలో కాబోయే తల్లులకు ఉత్తమ ఫలితాలను అందించేందుకు కట్టుబడి ఉన్నాము’’ అని వివరించారు.
సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ (SSI) నివారణ మరియు నియంత్రణ
ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్‌కేర్ ఇంప్రూవ్మెంట్ (IHI) అధ్యయనం ప్రకారం, యాంటీబయాటిక్స్, యాంటీ బాక్టీరియల్ వైద్య పరికరాలు మరియు సకాలంలో అందించే సరైన జోక్యం, చికిత్సలతో 40-60 శాతం SSIలను నివారించవచ్చు.
ప్రసవ ప్రక్రియలో ఇన్ఫెక్షన్ను నివారించేందుకు, ఆసుపత్రుల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసుపత్రుల్లో 24-48 గంటల లోపు స్టెరైల్ డ్రెస్సింగ్‌లు వేయడం, రోగిని శుభ్రపరిచేందుకు క్రిమినాశక సబ్బును ఉపయోగించడం, మాస్కు ధరించడం, తగిన ఏజెంట్లతో చర్మాన్ని శుభ్రపరచడం,శుభ్రమైన వైద్య పరికరాలు, సాధనాలను ఉపయోగించడం వంటి చర్యలు తీసుకోవలసి ఉంటుంది.
‘‘సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ను నివారించగల సమస్య అని సర్జన్లుగా మేము అర్థం చేసుకున్నాము. ప్రపంచ ఆరోగ సంస్థ (WHO) ఆమోదించిన SSIని అరికట్టేందుకు సాక్ష్యాలతో కూడిన- దశలు SSIను నివారించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. తద్వారా రోగికి చికిత్స ఖర్చు మరియు అనారోగ్యం భారం తగ్గుతుంది. సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ను నియంత్రించడానికి ఈ పరికరాలు అందుబాటులో ఉండాలి, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. విశ్వవ్యాప్తంగా స్వీకరించవలసి ఉంటుంది’’ అని హైదరాబాద్‌లోని అపోలో హెల్త్ సిటీకి చెందిన ప్రముఖ లాప్రోస్కోపిక్ & రోబోటిక్ సర్జన్, రూమా సిన్హా తెలిపారు.
ప్రసవ ప్రక్రియల్లో తరచూ కనిపించే సమస్యలను దృష్టిలో ఉంచుకుని, తల్లుల అనారోగ్యం, మరణాలను తగ్గించేందుకు, SSIని నిరోధించడానికి మరియు చికిత్స చేసేందుకు వ్యూహాలు అవసరం. వృత్తిపరమైన విద్యలో ప్రపంచ అగ్రగామిగా, జాన్సన్ & జాన్సన్ బాలింతల్లో అనారోగ్యం, మరణాలను తగ్గించడంలో సహాయపడేందుకు శస్త్రచికిత్సా విధానాలను మెరుగుపరిచేందుకు నిరంతరం శ్రమిస్తోంది.
జాన్సన్ & జాన్సన్ మెడ్‌టెక్ కంపెనీలలో భాగమైన ఎథికాన్, SSI ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు ప్రసవాలను సురక్షితంగా చేయడంలో సహాయపడే ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. వారి సమగ్ర శ్రేణి అబ్జార్బ్ అయ్యే కుట్లు, ముడి లేకుండా మరియు సాంప్రదాయ వైవిధ్యాలలో లభిస్తుండగా, ఇవి SSIలను దాదాపు 28 శాతం తగ్గించడంలో సహాయపడతాయి. మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం అనేది మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమైన సందర్భం కాగా, వారు సురక్షితమైన మరియు ఉత్తమమైన ప్రసవ పద్ధతులతో రక్షణ అందుకుంటారని ఇది నిర్ధారిస్తుంది.