Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచంలో నెంబర్ 1 మరియు భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం మోటర్‌సైకిల్ బ్రాండ్ కెటీఎం హైదరాబాద్‌లో జూన్ 2022 వ కెటీఎం ఎడ్వెంచర్ అకాడమీని నిర్వహించింది. కెటీఎం ఎడ్వెంచర్ అకాడమీ , క్లోజ్డ్–సర్క్యూట్ ప్రోగాం. ప్రత్యేకంగా దీనిని కెటీఎం ఇంటర్నేషనల్ అథ్లెట్ల మార్గనిర్దేశకత్వంలో తీర్చిదిద్దారు. కెటీఎం యొక్క మాస్టర్ ట్రైనర్లు దీనిలో భాగంగా శిక్షణ అందిచారు. దీనిద్వారా కెటీఎం అడ్వెంచర్ శ్రేణి వాహన యజమానులకు ఆఫ్ రోడింగ్ నైపుణ్యాలను అందించడంతో పాటుగా అత్యంత కీలకమైన ట్రయల్ రైడింగ్‌లో సైతం శిక్షణ అందించడం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఎడిషన్ ఎడ్వెంచర్ అకాడమీని శంకర్‌పల్లిలోని బిగ్ రాక్ డర్ట్ పార్క్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్సాహపూరితమైన,ప్రీమియం, ప్రో బైకింగ్ అనుభవాలను అందించడం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో కెటీఎం ఎడ్వెంచర్ వినియోగదారులు పాల్గొన్నారు. వీరంతా కూడా తమ ఆఫ్ రోడింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు పలు మార్లు సవారీ చేయడంతో పాటుగా తమలోని సాహసికుడిని కనుగొన్నారు. ఇదంతా బిగ్ రాక్ డర్ట్ పార్క్ టీమ్ లోని కెటీఎం మాస్టర్ ట్రైనర్స్ మార్గనిర్దేశకత్వంలో జరిగింది. ఈ ఒకరోజు కార్యక్రమంలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారికి బ్రాంజ్ లెవల్ సర్టిఫికేషన్‌ను అందించారు. కెటీఎం ఎడ్వెంచర్ అకాడమీని భారతీయ రైడింగ్ కమ్యూనిటీ నడమ ఎడ్వెంచర్ రైడింగ్ సంస్కృతిని ప్రోత్సహించాలనే నేపథ్యంతో తీర్చిదిద్దారు. అనుభవజ్ఞులైన రైడర్లకు అత్యుత్తమ ఆఫ్ రోడింగ్ డ్రిల్స్, రైడ్స్ అందిస్తామనే వాగ్ధానాన్ని ఈ కార్యక్రమం చేసింది. అదే సమయంలో తొలిసారిగా సవారీ చేస్తున్న వారికి తమ ఆఫ్ రోడ్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే దిశగా తొలి అడుగు వేసేందుకు తోడ్పడింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వినియోగదారులకు పలు ఆఫ్‌రోడ్ డ్రిల్స్ గురించి థయరీ మరియు ఆఫ్ రోడ్ డ్రిల్స్ పై శిక్షణ అందించారు. కెటీఎం అడ్వెంచర్ అకాడమీని దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో రాబోయే కొద్ది నెలల పాటు తరచుగా నిర్వహించనున్నారు. కెటీఎం ఎడ్వెంచర్ అకాడమీలో మాస్టర్ ట్రైనర్లు మరియు సర్టిఫైడ్ ఆఫ్ రోడ్ నిపుణుల చేత మాస్టర్ క్లాస్‌లను సైతం నిర్వహించారు. ఈ మాస్టర్ ట్రైనర్లు, నిష్ణాతులైన రైడర్లు మాత్రమే కాదు ట్రైల్స్, టార్మాక్‌లో అశేష అనుభవం కలిగిన వారు. ఈ ప్రోపర్టీ వెనుక ఉన్న వీరి మార్గనిర్దేశకత్వం ఉంది. కెటీఎం నిపుణుల బృందానికి శిక్షణ అందించిన వీరే ఈ కార్యక్రమాలను తీర్చిదిద్దడంతో పాటుగా తమ నైపుణ్యాలు మరియు అభ్యాసాలను కెటీఎం యజమానులు పంచుకునేందుకు ప్రోత్సహించారు. బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఎడ్వెంచర్ అకాడమీ అపూర్వ విజయం సాధించింది. అభిరుచి కలిగిన రైడర్లు తమ నైపుణ్యం ప్రదర్శించడంతో పాటుగా నేర్చుకునేందుకు కూడా అమితాసక్తి కనబరిచారు. ఎక్కువ మంది అభిమానించే యూరోపియన్ మోటర్‌సైక్లింగ్ బ్రాండ్‌గా బైక్ ప్రేమికుల నడుమ నిలిచిన కెటీఎం, ప్రతి వినియోగదారునికీ ప్రపంచశ్రేణి ప్రో బైకింగ్ అనుభవాలను అందించేందుకు లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటి వరకూ మేము 10000 మందికిపైగా కెటీఎం యజమానులను ప్రోత్సహించగలిగామని వెల్లడించేందుకు ఆనందంగా ఉంది. వీరంతా కూడా విభిన్నమైన కెటీఎం ప్రో–ఎక్స్పీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కెటీఎం 390 ఎడ్వెంచర్ మరియు కెటీఎం 250 ఎడ్వెంచర్ బైక్స్‌ను విడుదల చేసిన నాటి నుంచి మేము అపూర్వమైన స్పందన అందుకున్నాము. అంతేకాదు, బైక్ ప్రేమికుల కోసం వైవిధ్యమైన ఎడ్వెంచర్ టూరర్గా నిలువగలమనే వాగ్ధానం చేస్తున్నాము. కెటీఎం ఎడ్వెంచర్ అకాడమీ , హైదరాబాద్ విజయంతో , దేశ వ్యాప్తంగా ఈ తరహా మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నాము’’ అని అన్నారు