Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: వాహన అమ్మకాలు జూన్ మాసంలో దాదాపు మందగించాయి. అంతకు ముందు రెండు నెలలు మంచి జోరు కనబరిచిన ప్రయాణికుల వాహన అమ్మకాలు జూన్లో మాత్రం కేవలం 2.41 శాతం వృద్దితోనే సరిపెట్టాయి. అంతకు ముందు ఏప్రిల్లో ఈ వృద్ధి 15.83 శాతం గానూ, మే నెలలో 4.67 శాతంగానూ నమోదు అయిన సంగతి తెలిసిందే. మారుతీ సుజుకీ సంస్థ కార్ల అమ్మకాలలో కేవలం 1.8% వృద్ధి మాత్రమే నమోదు అయింది. మరోవైపు హ్యుందారు అమ్మకాలలో మాత్రం 8% పెరుగుదల నమోదు అయింది. టాటా మోటార్స్ అమ్మకాలు 30 శాతం పెరిగాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల అమ్మకాలలో మాత్రం 15% క్షీణత నమోదు అయింది.