Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్యాంకులో ఒక ఖాతా తెరవాలంటే ఖాతాదారునికి రూ.139 ఖర్చవుతుందని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. ఆర్బీఐ 2016లో చేసిన బ్యాంకుల ఆడిట్లో ఇది తేలింది. డాక్యుమెంటేషన్ ఖర్చులతో పాటు బ్యాంకుకు వెళ్లి వచ్చేందుకు ప్రయాణ ఖర్చులు కూడా అవుతాయని ఆర్బీఐ నివేదికలో తెలిపింది. ప్రయాణంతో కలుపుకుని ఖాతాదారుడికి సగటున 7.28 గంటల సమయం పడుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. తొలిసారి బ్యాంకుకు వెళ్లినప్పుడు కావాల్సిన వివరాలు కనుక్కోవడం, రెండో సారి కావాల్సిన పత్రాలు సమర్పించడం, అనంతరం బ్యాంకు ఖాతా తెరిచినట్టు బ్యాంకు సిబ్బంది ఇచ్చే డాక్యుమెంట్లను స్వీకరించడం ఇలా వెళ్లిన ప్రతిసారి అయ్యే ఖర్చులు మొత్తం 139 రూపాయల మేర అవుతుందని ఈ రిపోర్టు తెలిపింది. ఇందుకయ్యే వ్యయం తగ్గాలంటే బ్యాంకుల్లో సాంకేతికత పెరగాలని ఆర్బీఐ సూచించింది. ఆధార్, మొబైల్ ఫోన్ లాంటివి అందరినీ చేరితే ఈ ఖర్చులు దిగివస్తాయని ఆర్బీఐ పేర్కొంది.