Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 బడా బకాయి ఖాతాల గుర్తింపు
- రుణ బకాయిల విలువ రూ.లక్ష కోట్లపైమాటే..
- వసూళ్లకు కసరత్తును ప్రారంభించిన బ్యాంకులు!
- డిసెంబరులోగా పూర్తి చేసేలా చర్యలు...
- డిసెంబర్ 13 కల్లా తేల్చాలని ఆదేశాలు
ముంబయి : బ్యాంకులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న మొండి బకాయిల పని పట్టడానికి మరో అడుగు ముందుకు పడింది. బాడా బకాయిలతో రిజర్వు బ్యాంకు రూపొందించిన రెండో జాబితాలోని సంబంధితుల నుంచి రావాల్సి బకాయిలను వసూళ్లు చేయడానికి బ్యాంకులు కసరత్తును మొదలు పెట్టాయి. ఈ విషయాన్ని ముగ్గురు సీనియర్ బ్యాంకు అధికారులు తెలిపినట్లు మింట్ ఒక కథనంలో తెలిసింది. ఈ డర్టీ జాబితాలోని మొండి బాకీల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు డిసెంబర్ 13 గడువు విధించినట్లు వారు తెలిపారు. క్రితం జూన్‌లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 12 మంది అతిపెద్ద మొండి బకాయిదార్లకు (డర్టీ డజన్) సంబంధించిన తొలి జాబితాను వెల్లడించిన విషయం తెలిసిందే. వీటి పరిష్కారానికి బ్యాంకు దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఉపయోగించుకోవాలని నిర్దేశించుకుంది. ఈ 12 కంపెనీలు దాదాపుగా వివిధ బ్యాంకులకు రూ.2 లక్షల కొట్ట బాకీలు చెల్లించాల్సి ఉంది. రెండో జాబితాలో ఉన్న చాలా వరకు మొండిబాకీల ఖాతాల పరిష్కారానికి కసరత్తు జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపుగా రూ.10 లక్షల కోట్ల మొండి బాకీల ఒత్తిడిలో ఉన్నాయి. ఆర్బీఐ నిర్దేశించిన 28 ఖాతాలను డిసెంబర్ 13లోగా పరిష్కరించుకోవాలని ఇప్పటికే సూచించినట్లు సమాచారం. ఈ విషయంలో ఒకవేళ ఫలితాలను రాబట్టలేకపోతే తగు పద్దతిలో చర్యలకు దిగాలని రిజర్వు బ్యాంకు సూచించినట్లు సమాచారం. ఇచ్చిన ఆప్పులో 50 శాతం వసూళ్లు చేయాలని నిర్దేశించింది. అలా కాకపోతే వాటిపై బ్యాంకు దివాలా చట్టం కింద ఎన్సీఎల్టీికి వెళ్లాలని ఆర్బీఐ ఆదేశాలిచ్చింది.
రెండో జాబితాలో అత్యధిక మొండి బాకీలు కలిగిన కంపెనీల్లో వీడియోకాన్ ఇండిస్టీస్ లిమిటెడ్, జరుప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) ముందు వరుసలో ఉన్నాయని సమాచారం. ఈ 28 కంపెనీల అప్పుల విలువ లక్ష కోట్ల రూపాయలుగా ఉంటుందని పేరు చెప్పుడానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు మింట్‌తో పేర్కొన్నారు. తాము ఇప్పటికే జాయింట్ లెండర్స్ ఫోరమ్‌కు జూన్ 22న ఒక ఆఫర్ ఇచ్చామని.. ఆ వివరాలు వెల్లడించలేమని జేపీ గ్రూపు ఛైర్మన్ మనోజ్ గౌర్ తెలిపారు. తమ కంపెనీ అప్పుల కేసును ఎన్సీఎల్టీకి పంపలేదని వీడియోకాన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. తమ రుణాలపై చర్చలు తుది దశలో ఉన్నాయని సోమా ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. తామ రుణాల పరిష్కారానికి కాను పునర్ ప్రణాళికను ఎస్బీఐకి సమర్పించామని కోస్టల్ ప్రాజెక్ట్సు డైరెక్టర్ టి శ్రీనివాస రావు తెలిపారు.
రెండో జాబితాలో
పలు కంపెనీలివేనట!
వీడియోకాన్ టెలికామ్
వీడియోకాన్ ఇండిస్టీస్
ఐవీఆర్సీిఎల్
సోమా ఎంటర్ప్రైజెస్
విసా స్టీల్
ఎస్సార్ ప్రాజెక్ట్స్
జరు బాలాజీ ఇండిస్టీస్
జయప్రకాశ్ అసోసియేట్స్
నాగార్జున ఆయిల్ రిఫైనరీ
రుచి సోయా ఇండిస్టీస్
అన్‌రాక్ అల్యూమినియం
ఏషియన్కలర్ కోటెల్ ఇస్పాట్.
బిల్ట్ గ్రాపిక్ పేపర్ ప్రొడక్ట్స్
కస్టేక్స్్ టెక్నలాజీస్
ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ
జయశ్వాల్ నికో ఇండిస్టీస్
ఆర్చిడ్ ఫార్మా
సెల్ మాన్‌ఫ్యాక్చరింగ్
ఉత్తమ్ గల్వా మెటాలిక్
ఉత్తమ్ గల్వా స్టీల్
మన్నెట్ పవర్
విండ్ వాల్డ్ ఇండియా