Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా మొబైల్ వ్యాపారాన్ని వొడాఫోన్ సంస్థలో విలీనం చేసే ప్రతిపాదనకు మార్గం మరింత సలభమైంది. ఈ విలీన ప్రతిపాదనకు ఐడియా వాటాదారులు తమ సమ్మతి తెలిపారు. తాజా వాటాదారులు సమావేశంలో 99 శాతానికి పైగా వాటాదారుల విలీన ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్టుగా అదిత్యా బిర్లా గ్రూపు సంస్థ వెల్లడించింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యూనల్ (ఎన్సీిఎల్టీ) సూచనల మేరకు నిర్వహించిన వాటాదారుల సమావేశంలో ఈ నిర్ణయం వెలువడింది.