Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాణిజ్య విభగం: తెలంగాణ ప్రాంతంలో ఉత్తమ ఉద్యోగకల్పన సంస్థగా ప్రముఖ డెయిరీ ఉత్పత్తుల కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ నిలిచింది. వరల్డ్ సీఎస్ఆర్ డే అండ్ వరల్డ్ సస్టయినబులిటీ సంస్థ అందించే ఈ అవార్డు తెలంగాణ ప్రాంతంలో హెరిటేజ్‌కు లభించడం విశేషం. మరోవైపు ఇదే సంస్థకు చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎ.ప్రభాకర నాయుడుకు వరల్డ్ సీఎస్ఆర్ డే అండ్ వరల్డ్ సస్టయినబులిటీ సంస్థ అందించే సీఎఫ్‌వో లీడర్షిప్ అవార్డు కూడా లభించింది. హెరిటేస్ సంస్థకు చెందిన ఐస్‌క్రీమ్ తయారీ విభాగం కూడా ఢిలీలో జరిగిన డూపాంట్ 'గ్రేట్ ఇండియా ఐస్ క్రీమ్ అండ్ ఫ్రోజెన్ డిసర్ట్ కాంటెస్ట్ -2017'లో సత్తా చాటింది. వెనీలా, చాకోలెట్, సోర్బెట్ విభాగాల్లో సంస్థ వరుసగా సిల్వర్, సిల్వర్, బ్రాంజ్ అవార్డులను గెలుచుకుంది.