Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వ రంగంలోని దేనా బ్యాంకు గృహ, వాహన వంటి రిటైల్ రుణ వితరణను పెంచుకొనేందుకు గాను 'దేనా రిటైల్ లోన్ కార్నివాల్'ను ప్రారంభించింది. గురువారం ప్రారంభమైన ఈ మెగా కార్నివాల్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. డిసెంబరు నెలాఖరు (31) వరకు ఈ కార్నివాల్ దేనా బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉండనుంది. ఈ కార్నివాల్లో భాగంగా దేనా బ్యాంకు దాదాపు రూ.75 లక్షల వరకు గృహ రుణాలను 8.25 శాతానికి, కారు లోన్లను 9.0 శాతం వడ్డీకి అందించనుంది. కార్నివాల్లో బ్యాంకు మహిళలకు ప్రత్యేక పీటవేసింది. ప్రత్యేక ఆఫర్లో భాగంగా కార్లు కొనాలనుకొనే ఔత్సాహిక మహిళలకు కేవలం 8.90 శాతం వార్షిక వడ్డీకే కారు లోన్ అందించనున్నట్టుగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్నివాల్లో భాగంగా తీసుకొనే రుణాలకు ఎలాంటి ప్రాసెసింగ్ రుసుము ఉండదని బ్యాంకు తెలిపింది. కేవలం డాక్యుమెంటెషన్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఈ ప్రత్యేక ఆఫర్లో భాగంగా రుణాల పొందగోరే వారు దగ్గరలోని దేనా బ్యాంకు శాఖలను సంప్రదించవచ్చునని ఆ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్ సదరు ప్రకటనలో కోరారు.