Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: అపోలో హస్పిటల్స్ తన ఫార్మసీ సోర్ల సంఖ్యను మరింత విస్తరించాలని నిర్ణయించింది. రానున్న ఆరు నెలల కాలంలో తమ స్టోర్స్ సంఖ్యను 3000లకు విస్తరించాలని యోచిస్తు న్నట్టుగా ఆపోలో హస్పిటల్స్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అఖిలేశ్వరన్ కృష్ణన్ తెలిపారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ సెప్టెంబరు ముగింపు నాటికి దేశ వ్యాప్తంగా దాదాపు 2,742 స్టోర్స్‌ను కలిగి ఉంది. గతేడాది వరకు ఏడాదికి 200 స్టోర్స్ ఏర్పాటు లక్ష్యంగా తాము ముందుకు సాగామని ఆయన తెలిపారు. అయితే రానున్న రోజుల్లో దీనిని 300లకు పెంచాలని యోచిస్తున్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థ భాగంతో తాము 190 కొత్త స్టోర్లను ప్రారంభించామని తెలిపారు.