Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోట్లరద్దుతో దీర్ఘకాలంలో ప్రయోజనాలు: ఐఎంఎఫ్
వాహింగ్టన్: పెద్దనోట్ల రద్దు ప్రయోజనాలను దీర్ఘకాలంలో పొందవ చ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. గతేడాది నవంబర్లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. డీమానిటైజేషన్ ద్వారా భారత్లో మున్ముందు లబ్ది చేకూరే పరిస్థితులు ఉన్నాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ విభాగాపు డిప్యూటీ ప్రతినిధి విలియమ్ ముర్రే తెలిపారు. అయితే నోట్లరద్దు కారణంగా నగదు కొరత ఏర్పడడంతో ఆర్థిక కార్యకలాపాలు, ప్రాథమిక, ప్రయివేటు వినియోగంతో పాటు చిన్న వ్యాపారాలపై తాత్కాలిక అంతరాయాలు చొటుచేసుకున్నాయని ఆయన తెలిపారు. కాగా త్వరలోనే ఈ ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడనున్నట్టు పేర్కొన్నారు. ఇక డీమానిటైజేషన్ వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలతో పాటు డిజిటల్ చెల్లింపులు, బ్యాంకింగ్ వ్యవస్థలో మరింత బలోపేతం కానుందని వివరించారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రపంచదేశాలతో పాటు భారత వృద్ధి రేటు అంచనాలను వెల్లడించనుంది.