Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : చైనాలో నకిలీ ఐ-ఫోన్ల తయారీ కంపెనీపై పోలీసులు దాడి చేశారు. తొమ్మిది మందిని అరెస్ట్‌చేసి 40వేల నకిలీ ఐ-ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సంస్థ నిర్వాహకులు ఇతర దేశాల నుంచి పాత సెల్‌ఫోన్ సేకరిస్తారు. వీటిలో ఐ-ఫోన్లో ఉండే నకిలీ పరికరాలు అమరుస్తారు. ఆపై చక్కగా ప్యాక్ చేసి ఒరిజినల్లా కనిపించే లోగోను అతికిస్తారు. ఈ నకిలీ ఫోన్లను విదేశాలకు తరలించి విక్రయిస్తారు. బీజింగ్ కేంద్రంగా నడపబడుతున్న ఈ కంపెనీలో వందమంది పని చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్ల విలువ సుమారు 13 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.