Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : కార్ల తయారీలో నిర్మాణ లోపం కారణంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హౌండా చైనాలో లక్షల కార్లను వాపస్ తీసుకోనుంది. 2007 నుంచి 2011 వరకు విక్రయించిన కార్లలో డ్రైవర్ సీటు దగ్గర ఉండే ఎయిర్బ్యాగ్స్లో నిర్మాణ లోపం ఉందని ఆ సంస్థ గుర్తించింది. దీంతో 7,42,493 హౌండా సిటీ కార్లను సెప్టెంబర్లో వెనక్కు తీసుకోనుంది. వీటిని 2007 జనవరి 4 నుంచి 2011 డిసెంబర్ 30 వరకు విక్రయించారు. ఎయిర్ బ్యాగ్స్ నిర్మాణ లోపాన్ని ఉచితంగా సరి చేసి ఇవ్వనున్నట్లు సంస్థ తెలియజేసింది. కేవలం సూచించిన సమయంలో షోరూంకు కారు తెచ్చిస్తే సిబ్బంది వెంటనే లోపాన్ని సరిచేసి ఇస్తారని చెప్పింది. దీనిని ఎటువంటి ఛార్జీలు వసూలు చేయ్యరని కంపెనీ ప్రకటనలో పేర్కొంంది. కార్లను కొన్నవారందరికి లేఖలు రాశామని కంపెనీ తెలిపింది.