Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: అనుహ్యాంగా, అమాంతం పెరిగిన బిట్ కాయిన్ విలువ క్రమంగా పడిపోతోంది. బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా క్షీణిస్తోన్నాయి. బుధవారం సెషన్లో మరో 12 శాతం పతనమై 10వేల డాలర్ల దిగువకు క్షీణించింది. ఇంతక్రితం సెషన్లో కూడా 14 శాతం పడిపోయిన విషయం తెలిసిందే. దక్షిణ కొరియా, చైనా దేశాలు క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ను నిషేధంపై ప్రకటనలు చేయడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. గతేడాది బిట్‌కాయిన్ ఏకంగా 2000 శాతం పెరిగింది. 2017 డిసెంబర్లో బిట్‌కాయిన్ 19,800 డాలర్లగా నమోదైన సంగతి తెలిసిందే. కేవలం నెల వ్యవధిలో దాదాపు 50 శాతం మేర అంటే ఏకంగా10వేల డాలర్ల విలువ క్షీణించింది. కాయిన్‌డెస్క్ న్యూస్ సైట్ ధరల సూచీ ప్రకారం ఒక్క బిట్ కాయిన్ విలువ 9,958 డాలర్లుగా పలికింది.