Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ పవర్ బ్యాకప్ సొల్యూషన్స్ ప్రొవైడర్, గృహ విద్యుత్ ఉపకరణాల తయారీ కంపెనీ ల్యుమినస్ పవర్ టెక్నలాజీస్ కొత్తగా స్టెబిలైజర్ పరిశ్రమలోకి ప్రవేశించినట్లు తెలిపింది. టప్ ఎక్స్ శ్రేణీలో ఈ స్టెబిలైజర్లను అందుబాటులోకి తెచ్చామని ఆ కంపెనీ ఎండి విపుల్ సభర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అస్థిరమైన వోల్టేజీ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎసి, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్ల కోసం అత్యాధునిక టెక్నలాజీతో ఆరు రకాల స్టెబిలైజర్లను రూపొందించామన్నారు.