Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యూలర్ కొత్తగా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.398 ఆపై మొత్తాలతో కూడిన అపరిమిత ప్లాన్లను రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు రూ.3,300 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందించనున్నట్టు తెలిపింది. వివిధ డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లు, ఆన్లైన్ ఛానళ్ల ద్వారా ఈ రీచార్జ్‌లను చేసుకునే వారికి ఈ ఆఫర్ కింద రూ.50 విలువ కలిగిన ఎనిమిది డిస్కౌంట్ వోచర్లను పొందుతారని వెల్లడించింది. ఈ వోచర్లను కస్టమర్లు తర్వాత చేయించుకునే రూ.300, ఆపై మొత్తాలపై ఏడాది పాటు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతో పాటు రూ.2,700 విలువగల షాషింగ్ కూపన్లు కూడా అందించనున్నట్టు పేర్కొంది. ఈ కూపన్లను పార్టనర్ స్టోర్లు లేదా వెబ్సైట్లలో వినియోగించుకోవచ్చునని తెలిపింది. అదే విధంగా ఐడియా యాప్ లేదా వెబ్సైట్ ద్వారా రీచార్జ్ చేసుకునే వారికి అదనంగా మరో రూ.200 వరకు వాలెట్ క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది.