Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: టీవీఎస్ మోటార్ కంపెనీ సరికొత్త అపాచీ ఆర్టీఆర్ 160 బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 2018 టీవీఎస్ ఆపాచీ ఆర్టీఆర్ 160 4వీ పేరుతో దీనిని మార్కెట్లోకి తెచ్చింది. 160 సీసీ ఇంజిన్‌తో రూపొందించిన ఈ వాహనంను కార్బొరేటర్, ఈఎఫ్ఐ వేరియంట్లలో మార్కెట్లోకి తెచ్చినట్టుగా కంపెనీ తెలిపింది. కార్బొరేటర్ వాహనం ధరను రూ.81,490గాను.. ఈఎఫ్ఐ వేరియంట్ ధరను రూ.89,900 గా (ఎక్స్‌షోరూమ్-న్యూఢిల్లీ)టీవీఎస్ మోటార్ నిర్ణయించింది. నాలుగు వాల్వులు, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో పాటు మేటి పనితీరుతో ఈ వాహనం ఇండియన్ మోటార్ సైకిల్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలుస్తూ వస్తోందని వివరించారు.