Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆర్బీఐ కొత్తగా చలామణిలోకి తెచ్చిన రూ.2000 నోటును రద్దు చేసే ఆలోచనేది తమకు లేదని సర్కారు శుక్రవారం వెల్లడించింది. నల్లధనాన్ని నిరోధించే క్రమంలో పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసినట్టుగానే.. సమీప భవిష్యత్తులో రూ.2 వేల నోటును కూడా రద్దు చేస్తారంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆర్థికశాఖ లోక్సభలో దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చింది. రూ.2000 నోట్లను రద్దు చేసే ఉద్దేశమేదీ సర్కారుకు లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. మరోవైపు త్వరలోనే దేశంలోని అయిదు నగరాల్లో రూ.10 ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే క్రమంలో క్షేత్రస్థాయిలో కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్లలో ప్రయోగాత్మకంగా వాటిని విడుదల చేయాలని నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు.