Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రముఖ ట్రేడింగ్ సంస్థ 5పైసా డాట్ కామ్ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఉచిత మొబైల్ స్టాక్ ట్రేడింగ్ యాప్‌నకు అద్భుత స్పందన లభిస్తోందని ఆ సంస్థ సీఈవో ప్రకర్ష్ గగ్దాని తెలిపారు. ఇప్పటి వరకు ఈ యాప్‌ను దాదాపు 10 లక్షలకు పైగా వాడకందారులు డౌన్లోడ్ చేసుకున్నట్టుగా ఆయన వివరించారు. దీంతో ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబ డుతున్న ట్రేడింగ్ యాప్‌లలో ఒకటిగా '5పైసా' ట్రేడింగ్ యాప్ రికార్డును అందుకుందని ఆయన అన్నారు. 5పైసా అతి తక్కువ కాస్ట్ బ్రోకింగ్, పూర్తిగా పేపర్ రహిత అకౌంట్ ఓపెనింగ్, మ్యూచువల్ ఫండ్స్, బీమా, రీసెర్చ్, రోబో అడ్వయిజరీతో దేశంలోన వేగంగా వృద్ధి చెందుతోన్న డిస్కౌంట్ బ్రోకర్‌గా దూసుకపోతున్నటు తెలిపారు.