Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
ప్రపంచ ప్రఖ్యాత స్వీడన్ గృహోపకరణాల సంస్థ ఐకియా హైదరాబాద్‌లో 'లివింగ్ విత్ చిల్డ్రన్' పేరుతో విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతీయుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా తమ ఉత్పత్తులు చిన్నారులకు ఎలా నచ్చుతాయో తెలియజేసేందుకు, వాటితో పిల్లలు ఎలా సంతోషంగా ఆటలాడుకుంటారో వివరించేందుకు ఐకియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సంస్థ కమ్యూనికేషన్ అండ్ డిజైన్ మేనేజర్ మియా ఓల్సాన్ ట్యూనెర్ ఈ వర్స్షాప్ను అసక్తికరంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించనున్న ఐకియా స్టాల్లో ఈ చిన్నారుల ఫర్నిచర్‌ను అందుబాటులో ఉంచనున్నట్టుగా ఆమె వివరించారు.