Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను జూనియర్ ఉద్యోగుల వలసలు కలవర పెడుతున్నాయి. జూనియర్ స్థాయి ఉద్యోగులు అనుభవం కోసం ఇక్కడ కొలువుకు కుదరడం.. ఆ తరువాత కేవలం 2-4 ఏండ్ల మధ్య కాలంలోనే ఇన్ఫోసిస్ అనుభవాన్ని ఆసరా చేసుకొని కొత్త కొలువుల్లోకి ఎక్కువ ఆఫర్‌కు దూకేయడం జరుగుతోంది. ఈ విషయమై ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావ్ మాట్లాటుతూ సంస్థలో జూనియర్ స్థాయి ఉద్యోగులే ఎక్కవ మంది కంపెనీని వీడి వెళ్లిపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా వీరిలో రెండు నుంచి నాలుగు సంవత్సరాలలోపు అనుభవం ఉన్న వారే ఎక్కువ మంది ఉంటున్నారని వివరించారు. ఈ పరిస్థితి సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో లేదని ఆయన వివరించారు. ఉద్యోగుల్లో అసంతృప్తిని తొలగించడానికి కంపెనీ చాలా చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.