Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలుగు చలన చిత్రాల ప్రేమికుల కోసం ప్రముఖ డీటీహెచ్ సంస్థ టాటాస్కై కొత్తగా 'తెలుగు సినిమా' ఎక్స్‌క్లూజివ్ చానెల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు గాను ఆ సంస్థ స్టార్‌మా చానెల్‌తో ఒక ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశ వ్యాప్తంగా తెలుగు సినీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని నెలకు రూ.45ల అదనపు సబ్‌స్క్రిప్షన్‌తో 'తెలుగు సినిమా'ను అందిస్తున్నట్టుగా టాటాస్కై చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అరుణ్ ఉన్ని తెలిపారు. ఈ టాటాస్కై చానెల్ ద్వారా తెలుగు క్లాసికల్ మూవీలతో పాటుగా ఇటీవలే విడుదలైన సినిమాల ప్రీమియర్ షోలను అందుబాటులో ఉంచనున్నట్టుగా ఆయన తెలిపారు.టాటాస్కై ద్వారా యాక్షన్చ కామెడీ, థ్రిల్లర్, హార్రర్ విభాగాల్లో దాదాపు 100కు పైగా చిత్రాలను, మంత్లీ ఎక్స్‌క్లూజివ్ విభాగంలో మూపీ ప్రీమియర్లను ఆఫర్ చేస్తుందని ఆయన తెలిపారు.