Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రయివేట్ రంగ విత్త సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోకి భారీగా పెట్టుబడులు రానున్నాయి. తాజా సమాచారం ప్రకారం గ్లోబల్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కోటక్ బ్యాంకులో భారీస్థాయి పెట్టుబడులకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వారెన్ బఫెట్ సంస్థ బెర్కషైర్ హాథ్‌వే 4-6 బిలియన్ డాలర్లను (రూ. 28,000-42,000 కోట్లు) కోటక్ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయన బ్యాంకులో 10 శాతం వాటాను కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమోటర్ వాటా నుంచి లేదా ప్రయివేట్ ప్లేస్మెంట్ కింద ఆయన వాటాను సొంతం చేసుకోనున్నట్లు మీడియా పేర్కొంది. బ్యాంకులో ప్రస్తుతం ఉదరు కొటక్‌కు 29.73 శాతం వాటా ఉండగా, మొత్తం ప్రమోటర్ గ్రూప్‌నకు 30.02 శాతం వాటా ఉంది.
అయితే ఈ వార్తలను కోటక్ మహీంద్రా యాజమాన్యం తిరస్కరించింది. దీనికి సంబంధించి నివేదించడానికి తమ వద్ద సమాచారం ఏమీ లేదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. మరోవైపు వారెన్ బఫెట్ కొనుగోలు వార్తలతో ఇన్వెస్టర్లు కొటక్ మహీంద్రా షేర్లను భారీగా కొనుగోలు చేశారు. దీంతో ఈస్టాక్ ఒక దశలో దాదాపు 10 శాతం మేర పెరిగింది. ఆ తరువాత కొంత తగ్గి వాటాదారులకు 7 శాతం లాభాల్ని పంచింది.