Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ సాఫ్ట్వేర్ రంగంలో సరికొత్త ట్రెండ్‌కు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెర తీసింది. అంతార్జాతీయ ఐటీ దిగ్గజం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ (ఐబీఎం) కార్పొరేషన్ నుంచి కొన్ని సాఫ్ట్వేర్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఐబీఎం కూడా ధ్రువీకరించింది. తమ సంస్థకు చెందిన ఏడు ప్రధాన వ్యాపార ఉత్పత్తులను భారతకు చెందిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు విక్రయించాలని నిర్ణయించినట్టుగా ఐబీఎం తెలిపింది. ఈ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల మొత్తం విలువ 180 కోట్ల డాలర్ల దరిదాపుల్లో ఉండనున్నట్టుగా కంపెనీ వెల్లడించింది. హెచ్‌సీఎల్‌కు విక్రయించిన ఉత్పత్తులు తమ మొత్తం మార్కెట్లో 5000 కోట్ల డాలర్లకు దరిదాపుల్లో ఉంటుందని సంస్థ తెలిపింది. ఐబీఎం విక్రయించనున్న ఉత్పత్తుల్లో సెక్యూర్ డివైజ్ మేనేజ్మెంట్ ప్రోడక్డ్ బిగ్‌ఫిక్స్, మార్కెటింగ్ మరియు ఆటోమేషన్ ప్రోడక్ట్ యునీకా, వర్క్‌స్ట్రీమ్ కొలాబరేషన్ ప్రోడక్డ్ కనెక్షన్స్ తదితర ఉత్పత్తులు ఉన్నట్టుగా సంస్థ తెలిపింది. తాము కొనుగోలు చేయనున్న ఉత్పత్తుల్లో సెక్యూరిటీ, మార్కెటింగ్, కామర్స్ వంటి విభాగలకు చెందిన సాఫ్ట్వేర్లు ఉన్నట్టుగా హెచ్‌సీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సి. విజరుకుమార్ తెలిపారు. ఈ మొత్తం లావాదేవీ వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తికావొచ్చని రెండు సంస్థల వారు భావిస్తున్నారు.
రెడ్‌హ్యాట్ నిధుల కోసమే..
ఐబీఎం సంస్థ సాఫ్ట్వేర్ అమ్మకాలు ఇటీవలి కాలంలో తగ్గుతూ వస్తున్నాయి. ఈ కారణంగా గడిచిన త్రైమాసిక కాలంలో సంస్థ ఆదాయం గణనీయంగా కుంగింది. దీంతో సంస్థ ఆదాయం కోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్ నుంచి ఆకర్షణీయమైన ఆఫర్ రావడంతో సంస్థ కొన్ని సాఫ్ట్వేర్ ఉత్పత్తులను హెచ్‌సీఎల్‌కు అమ్మివేయాలని నిర్ణయించడం విశేషం. ఇదే సమయంలో హెచ్‌సీఎల్ సంస్థకు వర్థమాన మార్కెట్లో బిజినెస్ సర్వీసెస్ మార్కెట్లో అవకాశాలు పెరగడంతో ఆ సంస్థ మార్కెట్లో విస్తరణకు ఐబీఎం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇదే నేపథ్యంలో ఐబీఎం సంస్థ అమెరికాకు చెందిన రెడ్‌హ్యాట్‌ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉండడంతో.. నిధుల కోసం ఆ సంస్థ కొన్ని ఉత్పత్తులను వదులుకోవాలని నిర్ణయించినట్టుగా సమాచారం ఇందులో భాగంగానే ఆ సంస్థ హెచ్‌సీఎల్‌కు కొన్ని ఉత్పత్తులను అమ్మివేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం.
ఆశ్చర్యంలో సాఫ్ట్వేర్ పరిశ్రమ..
హెచ్‌సీఎల్ సంస్థ ఐబీఎం నుంచి కొన్ని సాఫ్ట్వేర్ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయాలని నిర్ణయించడాన్ని సాఫ్ట్వేర్ పరిశ్రమ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. పరిశ్రమలో ఇలా రెడీమేడ్ ఉత్పత్తులను ఒక సంస్థ నుంచి మరో సంస్థ కొనుగోలు చేయాలని భావిం చడం ఇదే తొలిసారని.. ఇలాంటి పోకడల వల్ల రానున్న రోజుల్లో ఐటీ పరిశ్రమ మనుగడకు కొంత విఘతం కలిగే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయి తే తమ ధోరణిని హెచ్‌సీఎల్ సంస్థ సమర్థించుకుంది. కాగా, మేటి సేవలను అందించే సంస్థలను కొనుగోలు చేయడం సంప్రదాయమని.. దానికి భిన్నంగా ఇప్పుడు ఆయా సంస్థల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భావిం చడం వినూత్న ధోరణి అని పరిశ్రమ పెద్దలు ఆక్షేపిస్తున్నా రు. ఇలాంటి పోకడల వల్ల ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలపై ప్రభావం పడుతుందని వారు అంటున్నారు.