Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీఎఫ్సీ బ్యాంక్ పేరు మారింది. తమ బ్యాంక్ పేరును 'ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్'గా మార్చుతున్నట్టుగా విత్త సంస్థ బీఎస్ఈ దాఖుల చేసిన ఫైలింగ్‌లో తెలిపింది. బ్యాంక్ పేరు మార్పు శనివారం నుంచి తక్షణం అమలులోకి వచ్చినట్టుగా ఐడీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. పేరు మార్పుకు సంబంధించి తమకు చెన్నైకి చెందిన 'రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్' నుంచి ధ్రువపత్రం అందినట్టుగా బ్యాంక్ తెలిపింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ క్యాపిటల్ ఫస్ట్, ఐడీఎఫ్సీ బ్యాంకులు తమ విలీనపు ప్రక్రియ డిసెంబరు 18తో ముగిసినట్టుగా తెలిపాయి. దీనికి అనుగుణంగానే రెండు సంస్థల పేర్లు వచ్చేలా ఇప్పుడు ప్రయివేటు విత్త సంస్థ పేరును 'ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్'గా మార్చారు. రెండు సంస్థల విలీనం తరువాత ఉమ్మడి సంస్థ రుణాల వితరణ వ్యాప్తి మొత్తం రూ.1.03 లక్షల కోట్లకు చేరినట్టుగా బ్యాంక్ తెలిపింది. విలీనం పూర్తయిన నేపథ్యంలో ఫస్ట్ సంస్థ వ్యవస్థాపకులు, చైర్మెన్ వి. వైద్యనాథన్‌ను ఉమ్మడి సంస్థ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించేందుకు గాను ఐడీఎఫ్సీ బోర్డు సమ్మతి తెలిపింది.