Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నయ్ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ 15.5 శాతం వృద్ధితో రూ.178.4 కోట్ల నికర లాభాలు సాధించింది. 2017-18 ఇదే క్యూ3లో రూ.154.4 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.3,703.1 కోట్లుగా ఉన్న రెవెన్యూ క్రితం క్యూ3లో 26 శాతం వృద్ధితో రూ.4,664.6 కోట్లుగా చోటు చేసుకుంది. ఇదే సమయంలో ఎగుమతులతో కలుపుకుని కంపెనీ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 18.9 శాతం పెరిగి 9.50 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.