Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా తన ప్రత్యర్థులతో పోటీపడుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రిలయన్స్ జియోకు తగిన విధంగా పోటీ ఇచ్చేలా వొడాఫోన్ ఐడియా సొంత మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వినియోగదారులకు సంగీతం సేవలతో ఇంకాస్త దగ్గరయ్యే వ్యూహంలో భాగంగా కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ యూప్ను ప్రవేశపెట్టనుంది. మార్కెట్ పోటీకి అనుగుణంగా సరికొత్త ఫీచర్లతో ఈ యాప్ ఉండాలని వొడాఫోన్ ఐడియా సంస్థ భావిస్తోందట. ఐడియా మ్యూజిక్ యాప్ను తొలగించిన స్థానంలో అంతకు మించిన ఫీచర్లతో, ఆకట్టుకునేలా ఉండే యాప్ తీసుకురానుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి చివరి అంకంలో ఉన్నారని వోడాఫోన్ ఐడియా సీఈవో బాలేశ్శర్మ వ్యాఖ్యలను ఉల్లేఖిస్తూ ఓ పత్రిక కథనం ప్రచురించింది. కాగా, సంగీత ప్రేమికుల కోసం మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జియో సావన్ను రిలయన్స్ జియో ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అలాగే 10కోట్లు యూజర్లతో భారతీ ఎయిర్టెల్కుచెందిన వింక్ మ్యూజిక్ యాప్ద్వారా ఇప్పటికే తన సేవలను అందిస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఐడియా మ్యూజిక్ యాప్లో 30లక్షల పాటలున్నట్టు గణాంకాల ద్వార తెలుస్తోంది.