Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా కొత్త సీబీ యూనికార్న్ 150 వాహనాన్ని మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్‌ను సంస్థ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)తో అప్డేట్ చేసింది. ఈ వాహనం ధరను కంపెనీ రూ.78,815గా (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించింది. నాన్ ఏబీఎస్ వేరియంట్‌తో పోలిస్తే ఈ కొత్త బైక్ ధర రూ.6,500 ఎక్కువగా ఉంది. సింగిల్ చానల్ ఏబీఎస్, లాంగ్ సీట్, సాఫ్ట్ సస్పెన్షన్, నో నాన్సెన్స్ డిజైన్ వంటి ప్రత్యేకతలు ఈ బైక్ సొంతం. ఇందులో 149.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ 12.73 హెచ్‌పీఏ 5500, బైక్ మాగ్జిమమ్ టార్క్ 12.8 ఎన్ఎంఏ5500 ఆర్పీఎం. ఈ బైక్‌లో 5 గేర్లు ఉంటాయి. బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్ ఉంటుంది. అలాగే ఇందులో అనలాగ్ ఇన్స్ట్రూమెంట్ కన్సోల్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాహనం నలుపు, ఎరుపు, ఊదా రంగుల్లో లభిస్తుందని సంస్థ తెలిపింది.