Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య జీడీపీ వృద్ధి 6.6 శాతమే
- ముందస్తు అంచనాలూ తారుమారు
- మౌలిక రంగాల వృద్ధిలోనూ తిరోగమనమే...|
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మరింతగా మందగించింది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసిక కాలంలో దేశ వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదైంది. గత అయిదు త్రైమాసికాల్లో దేశ వృద్ధి రేటు ఇంత కనిష్ట స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలంలో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదు అయింది. అక్టోబర్-డిసెంబర్ మాసానికి సంబంధించిన జీడీపీ వృద్ధి గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్) గురువారం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని గత నెల సీఎస్వో ముందుగా అంచనాకట్టింది. గత ఏడాది ఇది 7 శాతంగా ఉంది. రాయిటర్స్ సర్వేలో 55 మంది ఆర్థిక నిపుణులు వ ద్ధిరేటు 6.9 శాతంగా ఉంటుందని అంచనావేశారు. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ వృద్ధి రేటు తక్కువగా నమోదు కావడం ఆశ్చర్యకర పరిణామం. అంతకు ముందు మొదటి, రెండో త్రైమాసికాల కాలంలో దేశ వృద్ధి రేటు వరుసగా 8.0, 7.0 శాతంగా నమోదు అయింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో స్థిర (2011-12) ధరల దగ్గర వాస్తవ జీడీపీ రూ.141.00 లక్ష కోట్ల స్థాయికి చేర నుందని అంచనా. జనవరి 31, 2019న ప్రకటిం చిన వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్స రానికి అంతకుముందు సవరించిన జీడీపీ అంచనా రూ.131.80 లక్షల కోట్లుగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతం ఉంటుందని అంచనా. 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉందని సీఎస్ఓ పేర్కొంది. మూడో త్రైమాసికంలో వృద్ధి పడిపోవడంతో ఈ ప్రభావం మొత్తం ఆర్థిక సంవత్సరపు వృద్ధిపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలోని మందగమన పరిస్థితికి ప్రస్తుత గణాంకాలు పూర్తిస్థాయిలో అద్దం పడుతున్నాయని వారంటున్నారు.
కీలక రంగాల వృద్ధి కిందకే...
ముడి చమురు, చమురు శుద్ధి, విద్యుత్తు రంగలు మెరుగైన పనితీరును కనబరచకపో వడంతో జనవరి మాసంలో కీలక రంగాల వృద్ధి రేటు 1.8 శాతానికి పడిపోయింది. 2018 జనవరిలో ఈ కీలక రంగాల వృద్ధి 6.2 శాతంగా నమోదు అయింది. జనవరి మాసంలో ముడి చమురు, చమురు శుద్ధి, విద్యుత్తు రంగాల ఉత్పత్తిలో 4.3%, 2.6%, 0.4% మేర కుంగింది. మరోవైపు బొగ్గు, సిమెంట్ రంగాల్లో వృద్ధి కూడా వరుసగా 1.7 శాతం, 11శాతం మేర మందగిం చింది. ఇదే తరుణంలో సహజ వాయువు, ఎరువులు, ఉక్కు ఉత్పత్తిలో 6.2%, 10.5%, 8.2% మేర వృద్ధి కనిపించింది. మౌలిక రంగానికి చెందిన ఎనిమిది కీలక రంగాల వృద్ధి తగ్గడం పారిశ్రామికోత్పత్తి సూచీపై (ఐఐపీ) తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కాగా ఏప్రిల్ నుంచి మొదలుకొని జనవరి వరకు గణాంకాలను విశ్లేషించి చూస్తే ఎనిమిది కీలక రంగాల వృద్ధి 4.5 శాతంగా నమోదు అయిందని సర్కారు గణాంకాలు చెబుతున్నాయి.