Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించిన ఈడీ వర్గాలు
- నిధుల అక్రమ రవాణా సంబంధించి లింకుంది..
- ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఎండీకి ఎదురు దెబ్బ
ముంబయి: వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 3250 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసేందుకు గాను క్విడ్‌ప్రోకో ప్రాతిపదికన సాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మెన్ చందా కొచ్చర్ వరసగా నాలుగో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. సోమవారం ముంబయిలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న చందా కొచ్చర్‌ను అధికారులు వివిధ విషయాలపై చర్చించినట్టుగా సమాచారం. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ సోమవారం కీలక ప్రకటన చేసింది. వరుసగా నాలుగో రోజు కూడా కొచ్చర్‌ను విచారించిన ఈడీ.. రుణాల కేటాయింపులో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారనేందుకు తమ వద్ద ప్రాథమిక సాక్ష్యాలున్నాయని పేర్కొంది. వీడియోకాన్ నుండి షెల్ కంపెనీల క్లస్టర్ ద్వారా రూ.64 కోట్లు కొచ్చర్ భర్త దీపక్ కొచర్కంపెనీకి అందాయని ఈడీ వర్గాలు తెలిపాయి. అదే సంవత్సరంలో ఫస్ట్ ల్యాండ్ హౌల్డింగ్స్ నుంచి కూడా మరో రూ.325 కోట్లు కూడా అందినట్టుగా ఆధారాలున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. దీపక్ కొచర్ భార్య ఐసీఐసీఐ బ్యాంకునకు సీఎండీగా ఉన్న కాలంలోనే ఈ పరిణామాలు జరగడం అనుమానాలకు తావిస్తోందనీ, దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నామని ఈడీ వర్గాలు తెలిపాయి. వీడియోకాన్ సంస్థకు భారీగా రుణాలను మంజూరు చేసిన విషయంలో దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద చందా కొచర్‌తో పాటు వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ నివాసాల్లో మార్చి 1వ తేదీన తొలిసారిగా సోదాలు సోదాలు నిర్వహించిన కొన్ని వివరాలను సమీకరించిన సంగతి తెలిసిందే. అనంతరం విచారణకు హాజరుకావల్సిందిగా చందాకొచర్, భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ మేనేజింగ్ డైరక్టర్ వేణుగోపాల్ ధూత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మూడో రోజైన ఆదివారం నూపవర్ రెన్యువబుల్స్‌లో మారిషస్ చెందిన ఫస్ట్ ల్యాండ్ హౌల్డింగ్స్ పెట్టుబడులకు సంబంధించి ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రుయా అల్లుడు , మాటిక్స్ గ్రూప్ చైర్మన్ నిషాన్ కనోడియాను కూడా ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. 2012లో వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3250కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసేందుకు క్విడ్‌ప్రోకో ప్రాతిపదికన సాయం చేసినట్లు చందాకొచర్‌పై ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఇప్పటికే కేసునమోదు చేసింది. అటు స్వతంత్ర దర్యాప్తును నివేదికను పూర్తిగా ఆమోదించిన ఐసీఐసీఐ బోరు ్డకూడా ఆమెను పదవినుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.