Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయి మనుగడకోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వ రంగ విత్త సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌ను ఆర్బీఐ ప్రయివేటు బ్యాంక్‌ల జాబితాలో చేర్చింది. ఈ ఏడాది జనవరి 21 నుంచి ఐడీబీఐ ప్రయివేట రంగ బ్యాంక్ క్యాటగిరిలోకి మార్చుతున్నట్టుగా ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ఐడీబీఐలో అత్యధిక వాటాను భారతీయ జీవిత బీమా సంస్థ 51 శాతం వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఐడీబీఐ హౌదాను ఆర్బీఐ ప్రయివేటు బ్యాంక్‌గా మార్చినట్టుగా తెలుస్తోంది. మార్కెట్ నియంత్రణ సంస్థల నిబంధనల మేరకు ఐడీబీఐ బ్యాంక్‌ల హౌదాను మార్చాల్సి వస్తోందని ఆర్బీఐ తెలిపింది. దీనికి తోడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు కూడా దేశంలో వ్యవస్థీకరణ చేయబడిన అత్యావశ్యక బ్యాంకులుగానే (డి సిబ్స్) కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది.