Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధికంగా వంద బిలియన్ డాలర్ల (రూ.ఏడు లక్షల కోట్లు) సంపద గల కుబేరుల క్లబ్‌లోకి మైక్రోసాఫ్ట్ అధినేత చేరిపోయారు. ఈ క్లబ్లో ఇప్పటి వరకు కేవలం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాత్రమే ఉండగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో సంపన్నుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కూడి చేరిరాఉ. ఈ ఏడాది గేట్స్ సంపద 100 బిలియన్ డాలర్లు దాటినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. జెఫ్ బెజోస్ సంపద 145.6బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపింది. ఈ ఒక్క ఏడాదే బెజోస్ సంపద 20.7 బిలియన్ డాలర్లు పెరగగా.. గేట్స్ ఆస్తులు 9.5 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. కాగా.. బిల్‌గేట్స్ 100 బిలియన్ డాలర్ల మార్క్ దాటడం ఇదే తొలిసారి కాదు. 1999లో గేట్స్ ఆస్తిపాస్తులు 100 బిలియన్ డాలర్లను దాటాయి. అయితే ఆ తర్వాత తన సంపదలో కొంత గేట్స్ ఫౌండేషన్‌కు ఇవ్వడంతో ఆయన నెట్‌వర్త్ తగ్గింది. గేట్స్ తర్వాత ఈ ఘనత సాధించిన మరో వ్యక్తి బెజోస్. అనూహ్యంగా అమెజాన్ అమ్మకాలు పెరగడంతో బెజోస్ చాలా అనతికాలంలోనే 100 బిలియన్ డాలర్ల సంపదను ఆర్జించి ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అయితే ఈ ఘనత వీరికి ఎక్కువ కాలం ఉండకపోవచ్చని బ్లూమ్‌బర్గ్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. గేట్స్ ఫౌండేషన్ కోసం ఇప్పటికే బిల్‌గేట్స్ 35 బిలియన్ డాలర్లకు పైగా విరాళమిచ్చారు. తన సంపదలో సగాన్ని గేట్స్ ఫౌండేషన్‌కు ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఆయన ఆస్తులు మరోమారు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. ఇక బెజోస్ తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నారు. భరణం కింద ఆయన ఆస్తుల్లో కొంత భార్యకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన కూడా బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి బయటకు వెళ్లాల్సి రావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.